Search
Wednesday 14 November 2018
  • :
  • :

స్కీం వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలి

ph4

మహబూబాబాద్ ప్రతినిథి: స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని45వ ఇండియన్ లేబర్ కమీషన్ సిఫార్సులను అమలు చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అజయ్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట బిక్షం, అంగన్‌వాడీ వర్కర్ల సంఘం జిల్లా నాయకులు జి.సులోచన, మంచాల భవానీ  ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. స్కీం వర్కర్ల సమస్యలపై సిఐటియు-ఎఐటియుఇ ఒక్కరోజు సమ్మెలో భాగంగా గురువారం స్థానిక తహీసీల్దారు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, సెకండ్ ఎఎన్‌ఎంలు, అభియాన్ తదితర స్కీం వర్కర్లు దేశవ్యాప్తంగా ఒక కోటి మంది నేటి సమ్మెలో ఉన్నారని, వారి సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ స్కీం లకు రాయితీలు తగ్గించి కోతలు విధుస్తోందని, అక్షయపాత్ర, మన్నుమోస్కాన్ లాంటి స్వచ్ఛంధ సంస్థలకు అవకాశాలు కల్పిస్తోందని, ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. స్కీంలను తాత్కాలి క స్కీంలుగా కేంద్రం భావించకుండా శాశ్వత స్కీం లుగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వారు డిమాం డ్ చేశారు. ఆయా సంఘాల నాయకులు రేషపల్లి నవీ న్, కుమ్మరికుంట్ల నాగన్న, పెరుగు కుమార్, ఎల్‌ఆర్ ఈశ్వరి, సుజాత, బిదు, రాజేశ్వరి, వి.లలిత, అనురాధ, ఉమామహేశ్రి, ఇందిర, లలిత, మామిండ్ల సాంబలక్ష్మి, సశీల, నాగెల్లి యాకమ్మ, భారతి, పద్మ, మహాలక్ష్మి, మంజుల, శివకుమారి, రాజ్యం, భాగ్య, రమాదేవి, ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments