Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

బోధనా రుసుములు, ఉపకార వేతనాల దరఖాస్తులకు ఆహ్వనం

ts-govt-logo.jpg1

మనతెలంగాణ/హైదరాబాద్‌ః బోధనా రుసుములు, ఉపకార వేతనాలకు సంబంధించి ఈ నెలాఖరు నుండి విద్యార్ధులు దరఖాస్తులు చేసుకునేందుకు రాష్ట్ర ఎస్.సి అభివృధ్ది శాఖ కసరత్తు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వీటికి సంబంధించిన దాదాపు 2200 కోట్ల రూపాయల బకాయీలు ఉండగా కేవలం ఐదు వందల కోట్ల రూపాయల బకాయీలను మాత్రమే ఇప్పటి వరకు విడుదల చేసింది. దీనితో ఎస్.సి, ఎస్.టి, బీసీ, మైనారీటీ లకు చెందిన విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వంపై విద్యార్ధి సంఘాలు,బీసీ, ఎస్.సి, ఎస్.టి, మైనారీటీ సంఘాల నేతలు తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు ప్రత్యక్ష ఆందోళనలు కూడా చేపడుతున్నారు. ఇలాంటి ఆందోళనల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గమనించిన రాష్ట్ర ఎస్.సి అభివృధ్ది శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ సంభందిత అధికారులను ఆదేశించారు.జిల్లాల్లోని బీసి, ఎస్.సి, ఎస్.టి, మైనారీటీస్, వికలాంగుల సంక్షేమ శాఖల అధికారులు, సి.జి.జి అధికారులతో బోధనా రుసుములు, ఉపకార వేతనాల చెల్లింపులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి కే ఆలస్యం అయినందున ఈ నెలాఖరు నుండి విద్యార్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనితో ఇప్పటికే మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న వారితో పాటు కొత్తగా కాలేజీలలో చేరిన విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కలిపిస్తున్నారు. ఈ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వల్ల పాతవి, కొత్తగా కలిపి దాదాపు 14నుంచి 15 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తుల కోసం తెలంగాణ ఈ పాస్ వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు చేయబోతుంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారికి ఎస్.సి అభివృధ్ది శాఖ ఆదేశాలు ఇచ్చింది. 2015-2016 సంవత్సరంలో చేరిన విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే బోధనా రుసుములు, ఉపకార వేతనాల చెల్లింపుల విషయంలో స్థానిక సమస్య తలెత్తిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పునర్విభజన చట్టం ప్రకారం పది సంవత్సరాల పాటు ప్రెసిడెన్సియల్ ఆర్డర్ అమల్లో ఉంటుందని, దీని ప్రకారం స్థానికతను సంబంధిత ఉత్తర్వుల ప్రకారం గుర్తించాలని కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Comments

comments