Home నల్లగొండ తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

School Bus Damage In Road Accident In Nalgonda

మన తెలంగాణ/ హాలియా: స్టీరింగ్ రాడ్డు బోల్ట్ ఊడి పోవడంతో  అదుపుతప్పి పొలాల్లోకి స్కూల్ బస్సు దూసు కెళ్లిన సంఘటన అనుముల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో  శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. దీంతో  చిన్నారులకు పెనుప్రమాదం తప్పింది. సంఘటన జరగ గానే కొత్తపల్లి, తెట్టెకుంట గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద మొత్తంలో అక్కడికి తరలివెళ్లి బస్సులో నుంచి చిన్నారులను సురక్షితంగా బయటకు తీశారు. పోలీసుల కథనం ప్రకారం హాలియాలోని వీఎస్‌ఆర్ పబ్లిక్ స్కూల్కు చెందిన స్కూల్ బస్సు 40 మంది విద్యార్థులతో తిరుమలగిరి మండలం తెట్టెకు ంట గ్రామం నుంచి హాలియా పాఠశాలకు శుక్రవారం ఉదయం బయలుదేరింది. కొంత దూరం రాగానే స్కూల్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసు కెళ్తుం డగా డ్రైవర్ ఎంత ప్రయత్నించి బ్రేక్ వేసినా ఆగకుండా రోడ్డు కిందిభాగానికి దూసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే కిందిభాగంలో చెట్ల మొదళ్లు గట్టిగా తగలడ ంతో బస్సు ఆగింది. లేనట్లైతే ఒక అడుగు దూరం ముం దుకు పోయినాకల్వర్టు దిగి బస్సు బోల్తాపడేదని అధి కా రులు తెలిపారు. ఈసంఘటనతో బస్సులో ఉన్నచి న్నారులు భయాందోళనకు గురై ఏడ్చారు. అక్కడికి చేరకున్న తెట్టెకుంట, కొత్తపల్లి గ్రామాల ప్రజలు వారిని ఊరగించారు. వెంటనే క్రేన్ తెప్పించి స్కూల్‌బస్సును బయటకు లాగారు. విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని వారి చిన్నా రులను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం బస్సును హాలియా పోలీస్‌స్టేషన్కు తరలించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్, ఎమ్‌వీఐ, విద్యాశాఖ అదికారులు: హాలియాకు చెందిన వీఎసార్‌స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిందని విషయం తెలుసుకున్న వెంటనే హాలియా ఎస్.ఐ. సతీష్‌కుమార్, మిర్యాలగూడ ఎమ్‌వీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్‌ఈవో తరి రాము సంఘటన స్థలానికి చేరుకు న్నారు. ఎస్.ఐ. సతీష్‌కమార్ ఎమ్‌వీఐ అదికారులకు ఈకేసును మళ్ళీస్తున్నట్లుపేర్కొన్నారు. అనంతరం ఎమ్‌వీఐ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుడూత బస్సు స్టీరింగ్ రాడ్డు కింద బోల్డ్ ఉడడం వల్ల సంఘటన చోటు చేసుకుందని అక్కడ మూలమడత ఉండడంతో డ్రైవర్ చాకచక్యంగానే వ్యవహారించడంతో పెనుప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. బస్సు పిట్‌నెస్, ఇన్సురెన్స్, ప్రాలు పరిశీలించారు. మండల విద్యాధికారి తరి రాము మాట్లాడుతూ విద్యార్లుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వారిని సురక్షితంగా వారి తల్లి తండ్రులకు అప్పగించామని విద్యాశాఖ నుంచి బస్సుకు సంబంధించిన పిట్‌నెస్‌పై ఎమ్‌వీఐ అధికారులకు లేక రాసినట్లు పేర్కొన్నారు.