Home తాజా వార్తలు స్కూల్ బస్సుకు చిన్నారి బలి

స్కూల్ బస్సుకు చిన్నారి బలి

Kid-Killed-By-Bus

షాబాద్:  స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండల పరిధిలోని గోపిగడ్డ గ్రామానికి చెందిన మోముల చంద్రశేఖర్‌రెడ్డి, లావ ణ్య దంపతులకు ఒక కుమారుడు, ఒక కు మార్తె ఉన్నారు. పెద్దవాడైన సాత్విక్‌రెడ్డి షా బాద్‌లోని మాంటీసోరి పాఠశాలలో చదువుతున్నాడు.  సోమవారం ఉదయం గ్రామంలో కి పాఠశాల బస్సు రావడంతో తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడిని బస్సు ఎక్కించేందుకు వచ్చాడు. రోడ్డు పక్కనే ఇల్లు ఉండడంతో  కుమార్తె ఆధ్యా (22 నెలలు) ఇంట్లో నుంచి రోడ్డుపైకి వచ్చింది. ఇది గమనించని బస్సు డైవర్ బస్సును ముందుకు తీయడంతో బస్సు ముందు చక్రం ఆధ్యా తలపై నుంచి వెళ్లింది. దీంతో తల పగిలి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వ హించి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.