Home కెరీర్ మాకు మరోక బస్సు కావాలి: ఆదర్శపాఠశాల విద్యార్థులు

మాకు మరోక బస్సు కావాలి: ఆదర్శపాఠశాల విద్యార్థులు

Studentsరంగారెడ్డి: పాఠశాలకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బంది నెలకోందని తమకు మరోక బస్సును అదనంగా వెయ్యాలని ఆదర్శపాఠశాల విద్యార్థులు కుల్కచర్ల ప్రధాన చౌరస్థాలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాఠశాల సమయానికి తాము చేరుకోవడం ఇబ్బందికరంగా మారిందని దీనివల్ల తమ విద్యపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని అధికారులు తమను పట్టించుకోక పోవడంతో తాము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించే వరకు తాము ఇక్కడ నుండి కదలమని తమ చదువులకు ఇబ్బందిగా మారిన బస్సుల కోరతను తీర్చి తమ సమస్యలను పరిష్కరించాలని నిరసనను వ్యక్తం చేశారు. పరిగి -పాలమూరు రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. బస్సులు నిలిచిపోవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యార్థుల సమస్య పట్ల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు.