Home భద్రాద్రి కొత్తగూడెం మేం మగాళ్లం.. అంతా మా ఇష్టం

మేం మగాళ్లం.. అంతా మా ఇష్టం

Teacher

లక్ష్మీదేవిపల్లి: ఉపాధ్యాయులంటే ఎంతో భక్తి. క్రమ శిక్షణకు మారుపేరు. ఎంతోమందికి ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించే మహనీయులు. జీవితంలో ఏ స్థాయికి ఎదిగినప్పటికీ చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు అందరికీ గుర్తుంటారు. అటువంటి ఉన్నత విలువలున్న ఉపాధ్యాయ వృతి ప్రస్తుతం కొందరి వల్ల అభాసుపాలవుతోంది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల మధ్య అంతర్గతలొల్లి ఆ వృత్తికే కళంకం తెస్తోంది. ఈ వరుసలో ముందు నిలుస్తోంది…

లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ పంచాయతీలో గల ఎదురుగడ్డ ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ మొత్తం ఆరుగురు ఉపాధ్యాయులున్నారు. వీరిలో ముగ్గురు ఉపాధ్యాయులు కాగా మరోముగ్గురు ఉపాధ్యాయినులు. ఇంత వరకూ బాగానే ఉన్నప్పటికీ.. అంతర్గత ఓ పోరు నడుస్తోంది. ఉపాధ్యాయులు ముగ్గురు సమయానికి పాఠశాలకు రావడం లేదనే ఆరోపణ వినిపిస్తోంది.

ఈక్రమంలో గురువారం పాఠశాలను “మన తెలంగాణ” సందర్శించగా అది నిజమేనని తేలింది. ఉదయాన్నే ప్రతిజ్ఞ సమయానికి అక్కడ ఆ ముగ్గురుఉపాధ్యాయులు కనిపించలేదు. “కేవలం ముగ్గురు ఉపాధ్యాయినులు మాత్రమే కనిపించారు. అదేమని విద్యార్థులను ప్రశ్నించగా.. ఆ ముగ్గురు సార్లు ఎప్పుడూ ప్రయర్‌కు రారు. సాయంత్రం కూడా బడి వదిలి పెట్టకముందే ఇంటికెళ్లపోతారు.” అని చెప్పడం ఆ ఉపాధ్యాయుల తీరుకు
అద్దం పడుతోంది.

మేం మగాళ్లం..

ఇంత జరుగుతుంటే.. మరి ప్రధానోపాధ్యా యురాలు ఏమయ్యారు అనే సందేహం కలుగుతోంది కదా. ఆ ముగ్గురు ఉపాధ్యా యుల తీరుతో ఆమె నిస్సహాయురాలిగా మారిపోయారిపిస్తోంది. “సమయానికి రండి.. స్కూల్ వదిలిన తర్వాతే ఇంటికెళ్లాలి… సిలబస్ ఎంతవరకూ వచ్చింది..” ఇలాంటి
ప్రశ్నలు ఆ ముగ్గురు ఉపాధ్యాయులను వేస్తే “మే మగాళ్లం మాకే చెబుతావా..?” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ హెచ్‌ఎంవాపోతునారు.

ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయ వృత్తిలో సైతం ఆడ, మగా అనే వివక్ష తీసుకొస్తున్న ఈ ఉపాధ్యాయులు నిజంగా ఆ వృత్తికే చెరగని మచ్చ. యూనియన్‌ల ముసుగులో… ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం వంటి వాటి కోసం ఉపాధ్యాయ సంఘాలు శ్రమిస్తు న్నాయి. అటువంటి ఉపాధ్యాయ సంఘాల ముసుగులో ఈ ముగ్గురు ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే.. మేం నాయకులమంటూ బెదిరింపులకు పాల్పడు తున్నట్టు తెలుస్తోంది.

ఈ విషయమై యూనియన్ నాయకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి వారి వల్ల ఉపాధ్యాయ సంఘాలకు కళంకం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.

వేధింపులు వాస్తవమే: సుశీల, ప్రధానోపాధ్యాయురాలు ఆ ముగ్గురు ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురిచేస్తున్నారనే విషయం వాస్తవ
మేనని ఎదురుగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుశీల తెలిపారు. విధులకు సమయానికి రావడం లేదని చెప్పారు. ఎమైనా అడిగితే.. నువ్వు ఆడదానివి, మేం మగాళ్లం.. మమ్మల్ని అడిగే స్థాయి మీది కాదంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధులకు
సక్రమంగా ఎందుకు రావడం లేదని జంగల్ అనే ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా.. ఆయన తినే టిఫిన్ ప్లేట్ మోహం మీద విసిరికొట్టాడని కన్నీటి పర్యాంతమయ్యారు. మహిళనని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని వాపోయారు.

పరిశీలిస్తాం: హయగ్రీవా చారి, డిఇఒ ఎదురుగడ్డ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠ శాలలో ముగ్గురు ఉపాధ్యాయుల విషయమై తనకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఈ విషయమై సమగ్రంగా విచారణ నిర్వహిస్తామని తెలిపారు. నిజమని తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని
తెలిపారు.