Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

క్లబ్ డ్యాన్సర్లా చిందులేసిన ఉపాధ్యాయురాలు

Italian-School-Teacherరోమ్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు క్లబ్ డ్యాన్సర్‌ను తలపించే చిందులతో హల్‌చల్ చేసింది. ఈ ఇటాలియన్ హై స్కూల్ ఉపాధ్యాయురాలి వ్యవహారం అందరినీ విస్మయపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు రావడం సోషల్ మీడియాలో వైరల్‌లా వ్యాపించడం అన్నీ కూడా చకచక జరిగిపోయాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ప్రాటోలోని టస్కన్లో గ్రాంసికిన్స్ విద్యాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వర్డ్ ప్రాసెసింగ్ టీచర్‌గా పనిచేస్తున్న ఆమె క్లాస్ రూమ్‌లో అసభ్యకరంగా నృత్యం చేసింది. విద్యార్థులు అరుస్తూ ఉంటే మైమరిచి పోయిన ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే స్ట్రిప్ డ్యాన్స్(దుస్తులు తొలగిస్తూ చేసే నృత్యం) చేసింది. ఇది ఇలా ఉండగా ఈ వీడియోను గ్రాంసికిన్స్ విద్యార్థులే తీసి, సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఇదివరకు ఎప్పుడు కూడా సదరు టీచర్ నడవడికపై ఎలాంటి ఫిర్యాదులు లేవని ప్రధాన ఉపాధ్యాయురాలు మారియా గార్జియా తెలిపారు.

 

Comments

comments