Search
Monday 24 September 2018
  • :
  • :

మధ్యప్రదేశ్‌లో ఉన్మాది ఘాతుకం..!

Schoolgirl-Beheaded-in-MP

భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలోనే ఓ ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే పదకొండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తల నరికేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిగ్వానిలోని ప్రభుత్వ పాఠశాలలో పూజ అనే విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతుండటంతో హడావిడిగా పాఠశాలకు వస్తోందామె. అయితే ఆమెను వెంబడిస్తూ వచ్చాడో యువకుడు. అప్పటి వరకు పూజ వెనకాలే వచ్చిన ఆ యువకుడు పాఠశాల గేటు దగ్గరకు రాగానే ఉన్మాదిలా మారిపోయాడు. అందరూ చూస్తుండగానే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పూజపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో పూజ తల తెగి పక్కన పడిపోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న ఉన్మాది అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడే ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ దృశ్యాలను చూసి పాఠశాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments