Home సినిమా సైంటిఫిక్ లవ్‌స్టోరీ

సైంటిఫిక్ లవ్‌స్టోరీ

Kurraతేజ, తరుణ్, మాస్టర్ శ్రీరామ్‌చంద్ర ప్రధాన పాత్రల్లో కృష్ణమోహన్ గొర్రెపాటి దర్శక త్వంలో సిక్స్‌ఫ్రెండ్స్ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న చిత్రం ‘కుర్రతుఫాన్’. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. చిత్ర ముహూ ర్తపు సన్నివేశానికి నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ “కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే ఓ సైంటిఫిక్ లవ్‌స్టోరీ ఇది. అవుట్ అండ్ అవుట్ కామెడీతో రూపొందిస్తున్నాం. మంచి సస్పెన్స్‌తో సినిమా అంతా సాగుతుంది. నవంబర్ మొదటి వారంలో ఫస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నాం. రెండు షెడ్యూళ్లలో సినిమా పూర్తిచేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం”అని చెప్పారు. తరుణ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో సెకండ్ హీరోగా నటిస్తున్నాను. యూత్ ఎంటర్‌టైనింగ్ చిత్రమిది. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.పి.పట్నాయక్, చంద్రబోస్, రచ్చరవి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరాః గోపాల్ సామరాజు, సంగీతంః టి.పి.భరద్వాజ్, ఆర్ట్‌ః కృష్ణమాయ.