Home ఆఫ్ బీట్ ఆటబొమ్మల్లో అపాయం

ఆటబొమ్మల్లో అపాయం

Scientific researches says that there is Danger to Kids with Toys

పిల్లలకు ఆటబొమ్మలివ్వడం, ఆడించడం ఒక ముచ్చట. ఆ ఆటబొమ్మలుంటే పిల్లలు సర్వం మరిచిపోతారు. కొందరు తమ బాల్యానికి గుర్తుగా ఆటబొమ్మలను దాచిపెట్టుకుంటారు. మరికొందరు ఆటబొమ్మలకు చక్కని దుస్తులు, వస్తువులు అలంకరించి ముస్తాబు చేస్తుంటారు. బొమ్మల పెళ్లిళ్లు జరిపించడం సంప్రదాయం కూడా . ఇన్ని ముచ్చట్ల వెనుక కొన్ని అపాయాలు కూడా పొంచి ఉన్నాయి. పిల్లలు ఆట బొమ్మలను అదేపనిగా నోటిలో పెట్టుకోకుండా చూడాలి. అందులోని మేగ్రెట్ ముక్కలను తినకుండా జాగ్రత్త పడాలి. ఈ బొమ్మలవల్ల పిల్లలకు కలిగిన ముప్పును శాస్త్రవేత్తలు గమనించారు. ఈ సందర్భంగా రెండు కేసులను ఉదహరించారు. 18 నెలల పసిపాప ఆటబొమ్మలోని గుండ్రని చిన్న మేగ్నెటిక్ గోళీలను మింగేసింది. అవి పాప కడుపులో పేరుకుపోయి జీర్ణవ్యవస్థ దెబ్బతిని నొప్పి ఎక్కువైంది. చివరికి సర్జరీ చేసి ఆ గోళీలను బయటకు తీస్తేనే గానీ పాపకుదుట పడలేదు. మరో కేసులో ఎనిమిదేళ్ల బాలిక 2 సెం.మీ. పొడవున్న మేగ్నెటిక్ స్ట్రిప్స్‌ను మింగేసింది. ఆటబొమ్మలోనివే. చాలా తక్కువ ఖరీదు మేగ్నెటిక్ బొమ్మలు అంత లెక్కన అమ్ముతున్నారని మేగ్నెటిక్  భాగాలు సులువుగా బొమ్మనుంచి ఊడిపోతుంటాయని డాక్టర్లు చెప్పారు.  ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగితే కానీ ఈ ప్రమాదాలు తగ్గవని  డాక్టర్లు చెప్పారు. తల్లిదండ్రులు తమపిల్లలకు బొమ్మలు కొని ఇచ్చేటప్పుడు ఆ బొమ్మల భాగాలు వదులుగా ఉన్నాయాలేక బిగువుగా ఉన్నాయా పరిశీలించాలి. బొమ్మలు తయారు చేసేవారు పిల్లలకు అపాయం కలగని రీతిలో బొమ్మలను తయారు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.