Home ఆఫ్ బీట్ వేయి రెట్ల కాంతుల నక్షత్ర వీధి

వేయి రెట్ల కాంతుల నక్షత్ర వీధి

Galaxy

లండన్ : ఇప్పుడున్న పాలపుంత కన్నా వేయి రెట్లు వెలుగులు చిమ్మే నక్షత్ర మండలాన్ని కనుగొన్నారు. అంతరిక్షంలో ఎనెన్ని గెలాక్సీలు ఉన్నాయనేది కనుగొనడానికి పరిశోధకులు సాగిస్తున్న అధ్యయనంలో ఈ సరికొత్త గెలాక్సీ జాడ తెలిసింది. దీని ఉనికి గురించి ఖగోళ భౌతిక శాస్త్ర పత్రికలో ప్రచురించారు. స్పెయిన్‌లోని  రోఖ్యూ డి లాస్ ముచాచోస్ అబ్జర్వేటరీ నుంచి అత్యంత అధునాతన సూక్ష్మదర్శినులు (జిటిసి)తో ఈ పాలపుంతల ఉనికి గురించి వెల్లడైంది. నాసాకు చెందిన వైస్ శాటిలైట్, ఇయూ అంరిక్ష సంస్థకు చెందిన ప్లాంక్ శాటిలైట్ నుంచి అందిన కీలక అంశాలను క్రోడీకరించుకుని పరిశీలించగా ఈ కొత్త పాలపుంత గురించి తెలిసింది. టెలీస్కోప్ ద్వారా తీసిన ఛాయాచిత్రంతో పోలిస్తే నిజానికి ఈ గెలాక్సీ మరింత దైదీప్యమానంగా ఉందని వెల్లడైంది.