Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

సముద్రంలో పడి 2 రోజులైన పర్ఫెక్ట్ కండిషన్‌లో ‘ఐఫోన్7’

Scuba diver finds iPhone 7 in sea after 2 days in perfect working condition

లండన్: ఏదైనా స్మార్ట్‌ఫోన్ పొరపాటున మన చేయిజారి నీళ్లలో కానీ, కింద పడితే ఇక అంతే సంగతులు. దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. దాన్ని మూలన పడేసి కొత్త ఫోన్ కొనుక్కోవాల్సిందే. అయితే నాణ్యతలో తనకు తానే సాటిగా నిలిచే యాపిల్ మొబైల్స్ విషయంలో మాత్రం ఇది వర్తించదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నాణ్యతకు మారుపేరు యాపిల్ ఫోన్స్. అలాంటి యాపిల్ ‘ఐఫోన్ 7’ ఒకటి పొరపాటున ఓ కెనడా పర్యటకుడి చేతిలోంచి సముద్రంలో పడిపోయింది. దాన్ని గురించి వెతికిన ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడతడు. ఈ సంఘటన ఇంగ్లండ్‌లోని డోర్డర్ డోర్ దగ్గర చోటు చేసుకుంది. అయితే, యుకెకు చెందిన స్కూబా డైవర్ సిరీస్ హార్సీ అదే ప్రాంతలో డైవింగ్ చేస్తూ వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు సముద్ర గర్భంలో నుంచి సన్నగా మెరుపు కనిపించడంతో అదేంటో చూద్దామని వెళ్లింది. సముద్ర గర్భంలో వెలుగులు చిందిస్తున్న ఆ వస్తువును చూసి మొదట ఆమె షాక్ అయింది. అది ఐఫోన్ 7. టెక్ట్ మెసేజ్ రావడంతో అది బ్లింక్ కావడం, దాన్ని వెలుగు రావడం జరిగింది. దాన్ని బయటకు తీసుకువచ్చింది. సుమారు 48 గంటల పాటు నీళ్లలోనే ఉన్న ఫోన్ 84 శాతం బ్యాటరీతో మంచిగా పనిచేస్తోంది. సముద్రగర్భంలో ఉన్నప్పుడు కూడా ఐఫోన్ సిగ్నల్స్‌ను సరిగ్గా అందుకుని బాగా పనిచేసిందని, వాటర్ రెసిస్టెన్స్ ఐపి 67 రేటింగ్‌ను కలిగి ఉండటమే ఫోన్‌ను డిజిటైమ్స్ వెల్లడించింది. కాగా, తనకు దొరికిన ఫోన్‌ను హార్సీ పోగొట్టుకున్న కెనడియన్‌కు అందించింది.

Comments

comments