Home రాష్ట్ర వార్తలు ఇంటింటా ఫీవర్

ఇంటింటా ఫీవర్

వణికిస్తున్న సీజనల్ జ్వరాలు

రాష్ట్ర రాజధానిలో, జిల్లాల్లో కిక్కిరిసిన ఆసుపత్రులు
మంచాన పడుతున్న తండాలు టైఫాయిడ్, డయేరియా, మలేరియా, డెంగీ, చికున్‌గున్యా విజృంభణ

Fever

జిల్లాల నుంచి మన తెలంగాణ ప్రతినిధులు
రాష్ట్రంలో వాతావరణ మార్పులు, వర్షాల వల్ల జనం మంచాన పడుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ఆసుపత్రులు రో గులతో కిటకిటలాడుతున్నాయి. వాంతులు, విరేచనాలు, మలేరియా, కలరా, చికున్‌గున్యా మున్న గు వ్యాధులతో ఆసుపత్రుల్లో సతమతమవుతున్నారు. ఫీవర్ ఆసుపత్రిలో రోజూ 800 నుంచి 1000 మంది వరకు ఔట్ పేషంట్లు చికిత్సకోసం వస్తున్నారు. డెంగీ లక్షణాలు ఉన్నవారిని ఇన్‌పేషంట్లుగా చేర్చుకుంటున్నారు. విష జ్వరాలతో ఫీ వర్ ఆసుపత్రిలో 4,170 మంది, నిమ్స్‌లో 1250 మంది, గాంధీలో 1050 మంది, ఉస్మానియాలో 960 మంది, ఏరియా ఆసుపత్రుల్లో 680 మంది ఔట్ పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. ప్రభు త్వ ఆసుపత్రుల్లో అంతతమాత్రమే వైద్యం అందుతుండడంతో రోగులు  ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్,కామారెడ్డి జిల్లా ఆసుపత్రుల్లో సుమారు 100 మంది చికిత్స పొందుతుండగా ప్రైవేటు ఆసుపత్రుల్లో 600 నుంచి 1000 మంది వరకు చికిత్స పొందుతున్నారు.ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సీజనల్ వ్యాధులతో ప్రజలు నానాయాతనలకు గురవుతుండగా, గిరిజన గూడాల్లో ఇంటికి ఒకరు రోగాల బారిన పడడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతున్నది.ఆశ కార్యకర్తలు గ్రామాలను సందర్శిస్తున్నప్పటికీ ఆసిఫాబాద్ జిల్లాలో 264 మంది వైరల్ ఫీవర్ కారణంగా, 36మంది మలేరియాతో, వంద మంది వరకు టైఫాయిడ్‌తో 195 మంది డయేరియాతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 1623 మంది డయేరియా, జ్వరపీడిత కేసులు నమోదయ్యాయి.  రోజూ రిమ్స్‌కు 1500 మంది వరకు వ్యాధిపీడితులు వస్తున్నారు. ఏజెన్సీ మండలాలైన నార్నూర్, గాదిగూడ, జైనూర్, సిర్పూర్ (యు)తిర్యాణి మండలాల్లో డయేరియా,జ్వర తీవ్రత అధికంగా ఉంది.

నల్లగొండ జిల్లాలో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలుతున్నది. సూర్యాపేట జిల్లాలోని మాన్యా తండ విషజ్వరాలతో గత నెలలో మంచం పట్టింది. వరంగల్ జిల్లాలో ఒక్క సెప్టెంబర్ మాసంలోనే 3650 జ్వర కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో తురక చంటి  సెప్టెంబర్ మొదటి వారంలో విష జ్వరం సోకి మృత్యువాతపడ్డాడు.మలేరియా అనుమానంతో వైద్య శాఖ అధికారులు లక్షా 25 వేల మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 78 మలేరియా పాజిటివ్ కేసులు వచ్చాయని చెపుతున్నారు. ఎంజిఎంలో సగటున  రోజూ 150 కేసులు నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 21 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకుంటున్నారు.మహబూబ్‌నగర్ జిల్లాలో 74 డెంగ్యూ కేసులు,20 స్వైన్ ఫ్లూ కేసులు,6 మలేరియా కేసులు,4 చికెన్‌గున్యా కేసులు నమోదయినట్లు వైద్యాధికారులు తెలియజేశారు.కోస్గి, భూత్పూర్ మండలాల్లో మలేరియా, జడ్చర్ల, దేవరకద్ర, గండ్వీడ్, చిన్న చింతకుంట, దామరగిద్ద, కోయిల్‌కొండ, మూసాపేట స్వైన్‌ఫ్లూ విస్తరించినట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి,మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మధిర, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, బోనకల్లు, రఘునాథపాలెం,దోనబండ,రాములు తండ గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలిపోతున్నాయి. వీటిలో డెంగ్యూ పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి.

ప్రభుత్వాసుపత్రుల వైద్యులు నిర్లక్షం చేస్తుండడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో  సీజనల్ వ్యాధుల తీవ్రత అధికంగానే ఉంది. నాలుగు రోజుల క్రితం అమనగల్ ప్రభుత్వాసుపత్రిని మంత్రి లకా్ష్మరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా వందలాది మంది రోగులు పడిగాపులుపడుతుండగా  ముగ్గురు డాక్టర్లకు బదులు ఇద్దరే పని చేస్తుండడాన్ని గమనించి తీవ్రంగా మండిపడ్డారు. షాద్‌నగర్ ప్రాంతంలోని పలు తండాలతో సహా వికారాబాద్ జిల్లాలోనూ వ్యాధుల తీవ్రత నానాటికీ పెరుగుతున్నది.తాండూరు జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అధికారవర్గాలే చెపుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో కూకట్‌పల్లిలోని ఒక పాఠశాల విద్యార్థి   డెం గ్యూతో మరణించాడు.  కరీంనగర్ జిల్లాలో 9 మలేరియా కేసులు,23 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం,రామగుండం, జూపల్లి మండలాల్లో 4 డెంగ్యూ కేసులు నమోదుకాగా, మథని, గోదావరిఖని, కాల్వ శ్రీరాంపూర్‌ల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి.