Search
Saturday 17 November 2018
  • :
  • :

శెభాష్ పోలీసులు

POLICE-1

మన తెలంగాణ/సిటీ బ్యూరో : విధినిర్వహనలో ప్రతిభ కనబర్చిన 120 మంది పోలీ సు సిబ్బందికి నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి బుధవారం రివార్డులను అందజేశారు. నగర పోలీసు శాఖ పనితీరు, అధికారులు, సిబ్బంది పని తీరుపై మహేందర్‌రెడ్డి ప్రతి నెలనెల సమీక్షిస్తుంటారు. విధినిర్వహణలో మంచి ప్రతిభ కనబర్చిన వారికి ప్రోత్సాహకంగా నెల నెల రివార్డులు అందజేస్తున్నారు. ఈ ఆనవాయితీ గత రెండున్నరేళ్ల నుంచి కొనసాగుతుంది. నవంబ2016-జనవరి 4, 2017 వరకు విధినిర్వహణలో మంచి ప్రతిభ కనబర్చిన 120 మందిని గుర్తించారు. వారికి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రివార్డులను మహేంద ర్‌రెడ్డి అందించారు.రివార్డులు దక్కించుకున్న విభాగాల లో శాంతి భద్రతలు-54, సిసిఎస్-10 స్పెషల్ బ్రాంచ్-3, ట్రాఫిక్-225, టాస్క్‌ఫోర్క్-5, కార్ హెడ్‌క్వార్టర్-9, సిపిఎల్-2, సిఎస్‌డబ్లూ-2,ప్రధాన కార్యాలయం అడ్మిన్ సిబ్బంది-4, మినిస్ట్రీస్టాఫ్-2, ఐటిసెల్-4 మంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు అదనపు ఇన్‌స్పెక్టర్లు, 20 మంది ఎస్‌ఐలు, ఎనిమిది మంది ఎఎస్‌ఐలు, 16 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఒకరు మహిళా హెడ్‌కానిస్టేబుల్, 50 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు ఇద్దరు, హోంగార్డులు తొమ్మిది మంది, ఇతర హోదాకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు.

Comments

comments