Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఐపిఒ, షేర్ బైబ్యాక్ నిబంధనల్లో సెబీ మార్పులు

bs

న్యూఢిల్లీ: ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) సహా షేర్ బైబ్యాంక్‌ల నిబంధనల్లో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మార్పులు తీసుకొచ్చింది. ఐపిఒల ధర ప్రకటనకు సమయాన్ని ఐదు రోజుల నుంచి రెండు రోజులకు తగ్గించింది. గురువారం ముంబైలో బోర్డు సమావేశం తర్వాత సెబీ చైర్మన్ అజయ్ త్యాగి మీడియాతో మాట్లాడారు. మార్కెట్ నియంత్రణ సంస్థ బైబ్యాక్ నిబంధనలను సవరించిందని, అలాగే ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు), మ్యూచువల్ ఫండ్స్‌కు నిబంధనల హేతుబద్దీకరణ ఆలోచన ఉందని ఆయన చెప్పారు. కొత్త నిబంధనల కింద బైబ్యాక్ సమయంపై పలు నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఐపిఒలో షేర్ ప్రైస్‌బ్యాండ్ నిర్ణయించే సమయాన్ని ఐదు నుంచి రెండు రోజులకు తగ్గించామని, దీంతోపాటు బైబ్యాక్ , ఎఫ్‌పిఐ, మ్యూచివల్ ఫండ్స్ నిబంధనలు కూడా సవరించామని అన్నారు. కొత్త నిబంధనల ప్రకారం బోర్డు తీర్మానానికి, వాటాదారులకు చెల్లింపులు చేసిన తేదీకి మధ్య కాలాన్ని బైబ్యాక్ పీరియడ్‌గా భావిస్తారు. దీంతోపాటు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్స్(ఎంఐఐ)ల్లో 15శాతం వరకు విదేశీ సంస్థల వాటా ఉండవచ్చు. వీటితోపాటు నిబంధనల్లో కూడా మార్పులు చేసినట్టు త్యాగి తెలిపారు. పలు మార్పులకు బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు.

బోర్డు సమావేశం ముఖ్యాంశాలు
* కోటక్ కమిటీ సిఫారసుల మేరకు వివరాలను ఆడిటర్లు వెల్లడించాలి.
* ఆడిటర్ తప్పనిసరి వివరాల వెల్లడి ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది.
* సబ్ బ్లోకర్ల విభాగంతో సెబీ దూరంగా ఉండి.. సబ్ బ్రోకర్లను ఆథరైజ్డ్ విభాగానికి తరలిస్తుంది.
* ఎన్‌ఎస్‌ఇ కొ-లొకేషన్‌లో చర్యలు వచ్చే ఐదు రోజుల్లో పూర్తవుతుంది.
* వచ్చే కొద్ది రోజుల్లో కేసులో తీసుకున్న చర్యలు బహిర్గతం చేస్తారు.
* వాట్సాప్ లీక్‌పై సెబీకి నాలుగు రిపోర్టులు అందాయి. చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Comments

comments