Home బిజినెస్ 18 నుంచి రెండో దశ గోల్డ్ బాండ్లు

18 నుంచి రెండో దశ గోల్డ్ బాండ్లు

Gold-Pricesన్యూఢిల్లీ: రెండో దశ గోల్డ్ బాండ్లను ఈనెల 18న ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భౌతికంగా బంగారం డిమాండ్‌ను నియంత్రించాలనే లక్షంతో ప్రభుత్వం ఈ గోల్డ్ బాండ్లను ప్రారంభించింది. బాండ్ల కొనుగోలుకు ఈనెల 22వరకు సమయం ఉంటుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. రెండో దశ బంగారం బాండ్లను జారీ చేసే విషయమై బ్యాంకు సిఎండిలతో సమావేశం నిర్వహించామని అన్నారు. నవంబర్‌లో తొలి దశ బాండ్లను ప్రారంభించారు. ఈ ఫథకానికి రూ.246 కోట్ల విలువ చేసే 915.95 కిలోల బంగారం సేకరించారు. నగుదు చెల్లింపుపై సావరిన్ గోడ్డ్ బాండ్లను జారీ చేస్తారు. బాండ్లలో ఒక వ్యక్తి ఏడాదికి 500 గ్రాముల కంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. బంగారం 2, 5, 10 గ్రాముల పరిమాణాల్లో బాండ్‌లను జారీ చేస్తారు. ఈ బంగారం బాండ్‌పై తాత్కాలిక వడ్డీ రేటు చెల్లింపు 2-3 శాతం స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వం తరఫున బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు, పోస్ట్ ఆఫీస్‌లు బాండ్‌లను జారీ చేస్తాయి. బాండ్ మెచ్యూరిటీ వ్యవధి 5 నుంచి 7 ఏళ్లు, ఈ వ్యవధి వల్ల బంగారం ధరల్లో ఒడిదుడుకుల నుంచి ఇన్వెస్టర్లను రక్షించవచ్చు. కమోడిటీ ఎక్సేంజ్‌పై బాండ్లను సులువుగా అమ్మొచ్చు, ట్రేడ్ చేయవచ్చు.