Home తాజా వార్తలు రెండోసారి తండ్రయ్యాడు

రెండోసారి తండ్రయ్యాడు

Second son was born to hero gopichand

హీరో గోపీచంద్ మరోసారి తండ్రి అయ్యాడు. వినాయక చవితి పండుగ రోజున ఆయన భార్య రేష్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండవసారి తండ్రి కావడంతో గోపీచంద్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. పండుగ రోజున బాబు పుట్టడంతో ఆయన కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. గోపీచంద్, రేష్మలకు 2013 మే 13న వివాహం జరిగింది. వీరి వివాహమైన సంవత్సరానికి అంటే 2014 అక్టోబర్ 13న రేష్మ మొదటి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు విరాట్ కృష్ట అని పేరు పెట్టారు. విరాట్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మారిపోయానని గోపీచంద్ పలుసార్లు చెప్పాడు. ఇప్పుడు రెండో కొడుకు పుట్టడంతో మరింత సంతోషం ఆయన జీవితంలోకి వచ్చినట్లయింది. గోపీచంద్ భార్య రేష్మ హీరో శ్రీకాంత్‌కు దగ్గరి బంధువు. శ్రీకాంత్ వీరి వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు.