Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రెండో టి20: భారత్ బ్యాటింగ్

t20

డబ్లిన్: రెండో టి20 మ్యచ్‌లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.భారత్ ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో బరిలోకి దిగుతుంది.కెఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్, ఉమేశ్ యాదవ్ సిద్దార్థ్ కౌల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌తో సిద్ధార్థ్ కౌల్ అంతర్జాతీయ టి20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ధావన్, ధోనీ, భువనేశ్వర్ కుమార్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. మరోవైపు ఐర్లాండ్ పాయింటర్ స్థానంలో పోర్టర్ ఫీల్డ్‌ను జట్టులోకి తీసుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Comments

comments