Search
Monday 24 September 2018
  • :
  • :

సిరిసిల్లలో సెక్యూరిటీ టీమ్‌లను ఏర్పాటు చేయిస్తాం

She Teams

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళలను ఈవ్‌టీజింగ్ నుండి రక్షించ డానికి క్యూరిటీ టీమ్‌లను ఏర్పాటు చేస్తామని ఎస్‌పి విశ్వజిత్ బుధవారం వెల్లడించారు. సిరిసిల్లలో బుధ వారం షీ టీమ్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించ డానికి ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని సిరిసిల్ల, వేములవాడ రెండు పట్టణాల్లో షీ టీమ్‌లను ఏర్పాటు చేశామని అవి విజయవంతంగా పనులు చేస్తున్నాయన్నారు.

మరీ అత్యంత తొందరగా ఈవ్‌టీజర్లను అడ్డుకోవడానికి హైదరాబాద్ మాది రిగా క్యూరిటీ టీమ్‌లను సిరిసిల్లలో ఏర్పాటు చేసా మని మహిళలను వేధిస్తున్నారని సమాచారం అందిన పది, పదిహేను నిమిషాల్లో పోలీసు బృందాలు అక్కడికి చేరుకుంటాయని ఎస్‌పి వివరించారు. ఇప్ప టికే షీ టీమ్‌లు మఫ్టీ డ్రెస్సుల్లో ముఖ్యమైన కేంద్రాల్లో పెన్ కెమెరాలు, ఇతర రకాల ఎలక్ట్రానిక్ పరికరాలతో మహిళా వేధింపులను రికార్డు చేసి చట్టం పరిధిలో నిందితులను ముందుగా కౌన్సెలింగ్‌చేసి అప్పటికీ వారి తీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుం టామన్నారు.

మహిళలు, విద్యార్థినిలు తమను వేధిం చేవారి గురించి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, ఫిర్యా దు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతా యన్నారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేకమైన బాక్సులు అమరుస్తామని, ఈవ్‌టీజర్ల వివరాలు అందులో రాసి వేయాలని సూచించారు. ఈవ్‌టీజిం గ్‌ను అరికట్టడానికి విద్యార్థినులు, మహిళలు ధైర్యం గా ముందుకు వచ్చి సహకరించాలన్నారు. మహిళల భద్రత కోసం వాట్సాప్‌యాప్‌లను, 100 నెంబర్‌కు డయల్ చేయడం, టెక్నాలజీని వాడుకోవడం వంటివి చేయాలన్నారు. షీ టీమ్‌లు మరింత సమర్థవంతంగా పనిచేసేలా శిక్షణనిస్తామన్నారు. మరికొన్ని షీ టీమ్‌ల ను పెంచుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి సుధాకర్, సిఐలు మాధవి, విజయ్‌కుమార్, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, మహేశ్‌గౌడ్, చింతోజు భాస్కర్, జక్కని రాజు, నైన్జా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు బస్సుల్లో, కళాశాలల్లో, రోడ్లపైన వివిధ సందర్భాల్లో తాము ఎదుర్కొంటున్న ఈవ్‌టీజింగ్‌ను వివరించారు.

Comments

comments