Home మెదక్ వైభవంగా ప్రారంభమైన వనజాతర

వైభవంగా ప్రారంభమైన వనజాతర

mdk

ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిలు
జాతర ఏర్పాట్ల కొరకై రూ.1.5 కోట్ల కేటాయింపు – అభివృద్ధికి మరో రూ.3.5 కోట్లు
తెలంగాణ రాష్ట్ర సర్కార్ హయాంలోనే దేవాలయాల పునరుద్దరణకు ప్రత్యేక నిధుల మంజూరి
అమ్మవారి దర్శనం కొరకు వచ్చే భక్తులకు పూర్తి ఏర్పాట్లు
వేయ్యిమంది పోలీసులతో బందోబస్తు
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా : ఉప సభాపతి శ్రీమతి పద్మాదేవేందర్‌రెడ్డి
జాతీయ రహదారులు, రైల్వేలైన్ల రాకతో భక్తులకు సులభమైన ప్రయాణం
ప్రత్యేక టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఐకాన్ సంస్థను కోరాం : ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి

మెదక్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని ఆలయాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి భక్తులకు పూర్తి ఏర్పాట్లు సమకూర్చడంతో పాటు ప్రత్యేక నిధులను కూడా కేటాయించడం జరుగిందని ఉప సభాపతి శ్రీమతి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయలలో జరుగనున్న మూడు రోజుల జాతర ఉత్సవాలను ఆమె ప్రారంభించి, ప్రభుత్వం తరపున వనదుర్గాభవాని మాతకు పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతర కొనసాగుతుందని, జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం 1కోటి 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిందన్నారు. అత్యంత ప్రాచీన చ రిత్ర గల అమ్మవారి వైభవం అమోఘమైందన్నారు. పొరు గు జిల్లాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోనున్నందున ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏడుపాయలకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు కేటాయించి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహింపజేస్తున్నారన్నారు. ప్రభు త్వం జాతర ఏర్పాట్లకే కాకుండా ఆలయ అభివృద్ధి ఇతర ఏర్పాట్ల నిమిత్తమై మరో 3.5 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్‌లో కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆలయాల పునరుద్దరణ చేపట్టి భక్తులకు పూర్తి సౌకర్యాలను కల్పించడంలో ముందుందన్నారు. గత ప్రభుత్వాల హ యంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలను తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యతతో సరిపడ నిధులు కేటాయించి భక్తులకు మేలైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా ఏడుపాయల జాతరకు భక్తు ల సౌకర్యార్ధం కోరకు మంజీరా నుండి 0.3 టిఎంసిల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. పారిశుద్దం విషయంలో అధికారులు పూర్తి ఏర్పాటు చేయడమే కాకుం డా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా సీసీ కెమెరాలు అమర్చి వెయ్యికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు. మున్ముందు ఏడుపాయల ప్రాంతాన్ని పూర్తి అభివృద్ధిపథంలో ఉండే విధంగా ప్రభుత్వం కేటాయించే నిధులతో షాపింగ్ కాంప్లెక్స్‌లు, టూరిజం గేస్ట్‌హౌజ్‌లు కూడా నిర్మించేందుకు చర్యలు చేపడుతామన్నారు. రాష్ట్రం సుభిక్షం గా ఉండి సకాలంలో వర్షాలు కురిసి అందరికి ప్రభుత్వ పథకాలు చేరి రాష్ట్ర ప్రజ లు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఏడుపాయల ఎంతో ప్రసిద్ధిగాంఛిన దేవాలయమని, ఇక్కడికివచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేకూర్చేందుకు ప్రభు త్వం ప్రత్యేక నిధులను కేటాయించిందన్నారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుండి వ చ్చే భక్తుల రాకపోకల గురించి ప్రత్యేకమైన రహదారులు, రైల్వేలైన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మెదక్ – అక్కన్నపేట రైల్వే పనులు పూర్తైతే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, జిల్లా కేంద్రానికి జాతీయ రహదారులు కూడా రానున్నాయని దీంతో భక్తుల తాకిడి మరింత పెరగనుందన్నారు. ఇప్పటికే ఐకాన్ సంస్థను కూడా మెదక్ ప్రాంతాన్ని ప్రత్యేక టూరిజం కేంద్రంగా ప్రకటించాలని కోరడం జరిగిందన్నారు. మూడు నాలుగు సంవత్సరాల్లో భక్తుల తాకిడి రెట్టింపు కానున్నందున తగు చర్యలు ఏర్పాటు కోరకై కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధుల మంజూరికి కృషి చేస్తానన్నారు. అనంతరం నర్సాపూ ర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో దేవాలయాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తు సంపూర్ణ నిధులను కేటాయించి జాతర ఏర్పాట్లను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. పోతంశెట్టిపల్లి నుండి నిర్మిస్తున్న బిడ్జి ద్వారా నర్సాపూర్ నియోజకవర్గానికి అత్యంత సమీపంగా రోడ్డు మార్గం సుగమమై భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. అనంతరం రూ.16లక్షలతో ని ర్మించిన ఎగ్జిక్యూటీవ్ కార్యాలయ ప్రారంభం, సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాల ప్రదర్శనశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు మెంచు నగేష్, వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, గ్రంథాలయ సం స్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకటకిషన్‌రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.