Home తాజా వార్తలు పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తాం…

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తాం…

Seeds Melaవనపర్తి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో 46 వేల చెరువులను పునరుద్ధరించి సాగునీటిని అందించేదుకు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు  కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామని ,పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని  ఆయన చెప్పారు.శనివారం హైద్రాబాద్‌లోని రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయన్నారు. రైతులకు అనుకూ లంగా నిర్ణయాలు తీసుకుంటామని, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు అందజేస్తామని తెలిపారు. ప్రాజెక్టుల పనులను వేగవంంతం చేసి తెలంగాణ రాష్ట్రంలోని 46 వేల చెరువులకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి తెలంగాణ లో 40 లక్షల ఎకరాలకు సాగు నీటి అందిస్తామన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ఉమ్మడి పాలమూర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు. రైతులకు రైతుబంధు, రైతుభీమా , రుణమాఫి వంటి పథకాలతో రైతులకు వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ సిఎం కెసిఆర్ రైతుబాంధవుడయ్యారన్నారు. అనంతరం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులకు విత్తన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయం విద్యార్థులు ,రైతులు విత్తన మేళాకు హాజరయ్యారు.

Seeds Mela at Agricultural University