Home Default పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్

పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్

Seemanchal Express Derailedపాట్న: బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం తెల్లవారుజామున 3.52 గంటలకు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 9 రైలు బోగీలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. చాలా మంది గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీహార్ రాజధాని పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో సహదాయ్ బుజుర్గ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బీహార్‌లోని జోగ్‌బనీ నుంచి న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య ఈ రైలు నడుస్తుంది. రైలు ప్రమాద ఘటనపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ చర్యలను వెంటనే ప్రారంభించాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఒక జనరల్ బోగీ, ఏసీ కోచ్, బీ3, మూడు స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఎస్8,ఎస్9, ఎస్10 తో పాటు మరో 4 బోగీలు కూడా పట్టాలు తప్పినట్టు రైల్వే అధికారులు తెలిపారు. బాధితుల సహాయార్థం రైల్వే శాఖ హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు.. సోన్సూర్ – 06158 221645, హజీపూర్ – 06224 272230, బరౌని- 06279 232222.

Seemanchal Express Derailed in Bihar