Home తాజా వార్తలు సీత యాక్షన్ ట్రైలర్ విడుదల…

సీత యాక్షన్ ట్రైలర్ విడుదల…

Seetha Action Trailer

హైదరాబాద్: బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తేజ తెర‌కెక్కించిన సీత‌ మూవీ యాక్షన్ ట్రైలర్ దుమ్మురేపుతోంది. మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ అనే కాన్సెప్ట్ తో సీత మూవీని చేశామని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలో సోనూసూద్ విలన్ గా నటించాడు. మే 24న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. తాజాగా చిత్రానికి సంబంధించి యాక్ష‌న్ ట్రైల‌ర్ ను చిత్ర బృందం విడుద‌ల చేశారు. ఇందులో కాజ‌ల్ స్టంట్స్ ప్రేక్ష‌కుల‌కి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి. ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ సంగీతం అందించగా, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనీల్ సుంక‌ర  ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు.

Seetha Movie Action Trailer Released