Search
Wednesday 21 November 2018
  • :
  • :

మృతుల కుటుంబాలను పరామర్శించిన సీతక్క

Seethaka, who visited the families of the dead
వెంకటాపూర్ : వెంకటాపూర్ మండలంలోని రామాంజపురం గ్రామ పంచాయితి రాగుల రామ్మోహన్, రాగుల నరేష్ ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బుధవారం పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రామ్మోహన్, నరేష్ వికలాంగుల హత్యలు ప్రభుత్వ హత్యలేనని సీతక్క అన్నారు. తెలంగాణ వస్తే మన బ్రతుకులు మారుతాయని మన కష్టాలు తీరుతాయని యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేస్తే కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కుటుంబ పాలన చేస్తున్నారని వారు అన్నారు. తెలంగాణలో చదువుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం మొండి చేయి చూపిందని సీతక్క ఆవేదన చెందారు. చదువుకున్న రామ్మోహన్, నరేష్ లు ఉద్యోగం కోసం నాలుగు సంవత్సరాలు ఎదురుచూసిన కాని వారికి ఉద్యోగం రాకపోవడం వలన ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని వారు అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం ఏలాంటి వాగ్దనాలు చేసి మోసం చేయకూడదని ఆమె డిమాండ్ చేసారు. అనంతరం ములుగు మండలంలోని జాకారం గ్రామానికి చెందిన ఎం కొంరయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి నల్లెల్ల కుమారస్వామి, ఆకరాధ కృష్ణ , జయపాల్ రెడ్డి, గండి కుమార్, మహేష్, ఎండి లాలు పాషా తదితరులు పాల్గొన్నారు.

Comments

comments