Home తాజా వార్తలు శరవేగంగా సీతారామ ప్రాజెక్టు పనులు…

శరవేగంగా సీతారామ ప్రాజెక్టు పనులు…

Seetharama Project

 

వేంసూరు: మండలంలో సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకూ నియోజకవర్గంలో 80వేల ఎకరాల్లో సర్వే చేయడం జరిగిందని సర్వే బృందంలో సాయిచరణ్, అన్వేష్‌లు తెలిపారు. రాయుడుపాలెం, కల్లూరుగూడెం, చౌడవరం, రాజుగూడెం, దుద్దేపూడి, కందుకూరు గ్రామాలలో పిల్ల కాలువలు, పంట పొలాలు పూర్తి చేశామని వారు పేర్కొన్నారు. ఇంకా పదిహేను రోజులలో మిగతా పనులు పూర్తవుతాయని సీతారామ ప్రాజెక్టు ద్వారా మండలంలో సాగునీరు లంకాసాగర్‌లోకి వస్తాయని తెలిపారు. మండలంలో ఈ నీరు వలన వేలాది ఎకరాలలో పంట పండి నిత్యం కరువు కాటకాలతో అలమటిస్తున్న రైతాంగానికి వారి జీవితాల్లో వెలుగు రేఖలు సీతారామ ప్రాజెక్టతో ప్రకాశించనున్నాయి.

Seetharama Project Works is Going on Fast