Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు టీమ్ ఎంపిక…

Teem-india

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి 3 టెస్ట్ మ్యాచుల కోసం టీమ్‌ను బుధవారం  సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మొదటి టెస్ట్ టీమ్‌లో చోటు దక్కింది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్‌కు అవకాశం కల్పించారు. దినేష్ కార్తీక్‌ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. ఇక బొటన వేలి గాయంతో బాధపడుతున్న బుమ్రాకు కూడా టెస్ట్ టీమ్‌లో స్థానం దక్కింది. గాయం నుంచి కోలలుకున్న వేంటనే అతను టీమ్‌తో చేరబోతున్నాడు. యొ యొ టెస్ట్ పాసయిన పేస్ బౌలర్ మహ్మద్ షమిని కూడా సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడం గమనార్హం. బుమ్రాను టీమ్‌లోకి ఎంపిక చేసినా అతను రెండో టెస్ట్ నుంచి తుది జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటాడని బిసిసిఐ స్పష్టం చేసింది. బౌలర్ భువనేశ్వర్ కుమార్ వెన్ను గాయం ఎక్కువ కావడంతో టెస్టు టీమ్‌లోకి అతన్ని తీసుకోవాలా..? వద్ద..? అన్నది త్వరలోనే వెల్లడిస్తామని బోర్డు చెప్పింది. ఆగ‌స్ట్ 1న ఎడ్‌బాస్ట‌న్‌లో ఇండియా, ఇంగ్లండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది.

కోహ్లి, ధావన్, రాహుల్, విజయ్, పుజారా, రహానే, కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్ ఇంగ్లండ్‌తో టెస్ట్‌లకు టీమిండియా ప్లేయర్స్ గా సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.

 

Comments

comments