Home సినిమా సెల్ఫ్‌మేడ్ హీరో శర్వానంద్

సెల్ఫ్‌మేడ్ హీరో శర్వానంద్

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచే మనసు’. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై హను రాఘవపూడి దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 21న సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ “చాలా తక్కువ ట్రైలర్స్ చూడగానే నచ్చేస్తాయి. అలాంటి వాటిలో ఈ సినిమా ట్రైలర్ ఒకటి. నాకు లవ్‌స్టోరీస్ అంటే ఇష్టం. మలయాళంలో ‘ప్రేమమ్’ చూశాను. ఆతర్వాత ఫిదా, ఎంసిఎ చూశాను. వీటిలో నటించిన హీరోయిన్ సాయి పల్లవి అద్భుతమైన నటి. ఆమెతో కలిసి ఓ పాట చేయాలని కోరుకుంటున్నాను. నా ఫేవరేట్ డ్యాన్సర్ హీరోయిన్ సాయిపల్లవి. దర్శకుడు హను రాఘవపూడి చేసిన అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై సినిమాలు చూశాను. ఆయన లవ్ సీన్స్ చక్కగా ఉంటాయి. ఆయనతో ఓ లవ్ సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో శర్వానంద్ ఆ ఛాన్స్ కొట్టేశాడు. గమ్యం, ప్రస్థానం సినిమాల నుండి శర్వాను గమనిస్తున్నాను. అతను మంచి నటుడు. శర్వానంద్ సెల్ఫ్‌మేడ్ హీరో. అతని ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ “గోల్డెన్ హ్యాండ్ బన్నీ నా సినిమా ఫంక్షన్‌కు వచ్చాడు కాబట్టి ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. కథను నమ్ముకొని ఈ సినిమా చేశాం. ఈ చిత్రంలో కొత్త శర్వాను చూస్తారు. సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. అంకితభావంతో సినిమా చేసే మంచి నటి ఆమె. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది”అని పేర్కొన్నారు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ “రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను అలరించే మంచి లవ్ స్టోరీ ఇది. శర్వానంద్, సాయిపల్లవిల నటన అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాకు మంచి కథ, సంగీతం, నటులు కుదిరారు”అని తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ “బన్నీ డ్యాన్సులకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన మా ఫంక్షన్‌కు అతిథిగా రావడంతో నా కల నిజమైనట్లుగా ఉంది. అలాగే శర్వానంద్ వండర్‌ఫుల్ కోస్టార్. ఇంత మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ సుంకర, సుధీర్ వర్మ, అజయ్, కృష్ణకాంత్, విశాల్ చంద్రశేఖర్, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు.

Self made Hero Sharvanand : Allu Arjun

Telangana news