Search
Monday 24 September 2018
  • :
  • :

సినీనటుడు జెవి రమణమూర్తి కన్నుమూత

JV-Ramana-murthyహైదరాబాద్ : సీనియర్ సినీ నటుడు జెవి రమణమూర్తి బుధవారం కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జెవి రమణమూర్తి ప్రముఖ నటుడు జెవి సోమయాజులు సోదరుడు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకులాం గ్రామంలో జెవి రమణమూర్తి జన్మించారు. 1957లో ‘ఎమ్మెల్యే’ సినిమాతో 24వ ఏట సినీరంగ ప్రవేశం చేసిన జెవి రమణమూర్తి సుమారు 150 సినిమాల్లో నటించారు.
మాంగల్యబలం, బాటసారి, మరో చరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెండు మనసు, ఇదికథకాదు, శుభోదయం, ఆకలిరాజ్యం, సప్తపది, శుభలేఖ లాంటి హిట్ సినిమాల్లో అయన నటిచారు. ఓ పక్క సినిమాలతో పాటు నాటక రంగంలోనూ ఆయన కొనసాగారు. 20వ ఏట నుంచి ఏకధాటిగా 43 ఏళ్ల పాటు గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని స్వీయ దర్శకత్వంలో సుమారు వెయ్యి సార్లు ప్రదర్శించి అపర గిరీశంగా ప్రఖ్యాతిగాంచారు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు. రమణమూర్తి మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి గురైంది.

Comments

comments