Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఎసిబి వలలో సీనియర్ అసిస్టెంట్

Senior assistant at ACB trap

శ్రీశ్రీ హోమ్స్‌లోని ఇళ్లపై దాడులు
రూ.2 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు

మన తెలంగాణ/ బాలాపూర్ : ఎసిబి వలకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అ సిస్టెంట్ చిక్కారు. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కిష న్ ప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉ న్నాడనే అభియోగంపై బుధవారం మీర్‌పేట్ పురపాలక సంఘం పరిధిలోని శ్రీశ్రీ హోమ్స్‌లోని కిషన్ ప్రసాద్‌కు చెందిన రెండు ఇళ్లపై ఎసిబి డిఎస్‌పి బి.బి.సత్యనారాయణ ఆధ్వర్యం లో అధికారులు దాడులు నిర్వహించారు. కిషన్ ప్రసా ద్ ఇంటితో పాటుగా ఏకకాలంలో ఆయన బంధువు లు, పనిచేస్తున్న కార్యాలయంలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్‌పి సత్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం కిషన్ ప్రసాద్ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే అభియోగంపై దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో రెండు ఎకరాల స్థలం, మరో 4.5 గుంటల స్థలం, హస్తినాపురం డివిజన్‌లో ఓపెన్ ప్లాట్‌ను గుర్తించినట్లు ఆయన తెలిపారు. బంగా రం, నగదు లెక్కించాల్సి ఉందన్నారు. గుర్తించిన ఆస్తుల విలువ ఓపెన్ మార్కెట్‌లో సుమారుగా రూ. 2 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు.

Comments

comments