Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సెబీ చీఫ్‌గా అజయ్ త్యాగీ

IAS officer Ajay Tyagi appointed Sebi chief

న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సైంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నూతన ఛైర్మన్‌గా ఆర్థికశాఖ సీనియర్ అధికారి అజయ్ త్యాగీ నియమింపబడ్డారు. యుకె సిన్హా స్థానంలో త్యాగీ సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2011 ఫిబ్రవరి 18న సెబీ ఛైర్మన్‌గా నియమితులైన సిన్హా మూడేళ్ల పాటు పదవిలో ఉన్నారు.

అనంతరం ఆయన పదవికాలాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. దీంతో గతేడాది ఫిబ్రవరితో ఆయన పదవికాలం ముగియగా ప్రభుత్వం మరోసారి ఏడాది పొడిగించడంతో ఇప్పటివరకు కొనసాగారు. నూతన చీఫ్‌గా ఎన్నికైన త్యాగీ ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల శాఖ(ఇన్వెస్టిమెంట్) అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సెబీ ఛైర్మన్‌ పదవిలో అజయ్ త్యాగీ ఐదేళ్లు కొనసాగనున్నారు.

Comments

comments