Home బిజినెస్ జియో ఫోన్‌తో సంచలనం

జియో ఫోన్‌తో సంచలనం

 అనేక ఫీచర్లను కల్గి ఉన్న కొత్త ఫోన్

 22 దేశీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది

 సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి

 ఆగస్టు 24 నుంచి ప్రి-బుకింగ్    

 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ

JIO-IND

ముంబయి: ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న జియో ఫోన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. 4జి విఒఎల్‌టిఇ ఆధారిత ఫీచర్ ఫోన్‌ను జీరో రేటుతో అందిస్తున్నట్టు ప్రకటించారు. ముంబయిలో శుక్రవారం జరిగిన సంస్థ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేశ్ అంబానీ ఈ ఫోన్‌ను విడుదల చేశారు. జీరో రేటుకే భారత ప్రజలకు జియో ఫోన్ లభి స్తుందని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను అని ఆయన అన్నారు. రిలయన్స్ జియో సంచలనాలకు మా రుపేరుగా మారింది. జియో ఫోన్ మార్కెట్‌లో ప్రకం పనలు సృష్టిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిజిటల్ మార్కెట్‌లో ప్రధానంగా మూడు రంగాలపై ఈ పోన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, కేబుల్-డిటిహెచ్ సేవలు, ప్రవేశ స్థాయి స్మార్ట్‌ఫోన్ తయారీదారులపై భారీగా ప్రభావం ఉండనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖేశ్ అంబానీ జియోఫోన్‌ను ఆవిష్కరించగానే స్టాక్ మార్కెట్లో ఈ మూడు విభాగాల్లోని ప్రత్యర్థి కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఈ ఫోన్ రాకతో మైక్రోమాక్స్, లావా, కార్బన్, ఒప్పోలాంటి మొబైల్ ఫోన్ల అమ్మకాలపై తప్పకుండా ప్రభావం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. కేబుల్ డిస్ట్రిబ్యూటర్లు, డిటిహెచ్ కంపెనీలపై కూడా ఈ ఫోన్ పెద్దప్రభావమే చూపనుంది. ఎందుకంటే ఈ ఫోన్ తోపాటు మొబైల్ టు టివి కేబుల్‌ను అందిస్తున్నారు. ఈ జియోఫోన్ ఆ సెట్‌టాప్ బాక్స్‌గా మారిపోనుంది. ఎందు కంటే జియో యాప్ ద్వారా ప్రముఖ ఛానెళ్లన్ని అందుబాటులో ఉన్నాయి.
కాగా ఇండియా ఇంటెలిజెంట్ స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న ఈ జియోఫోన్‌ను మేడిన్ ఇండియాలో భాగంగా యువ భారతీయులు తయారుచేశారని ముఖేష్ అన్నారు. ఈ ఫోన్ కోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత ఒకేసారి తిరిగిఇవ్వనున్నట్టు చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఫోన్ వినియోగదారులకు డిజిటల్ ఫ్రీడమ్‌ను అందిస్తుం దని అన్నారు. జియో ఫోన్‌తో వాయిస్ కాల్స్ ఎల్లప్పుడు ఉచితంగా పొందవచ్చని, అపరమిత డాటా కోసం నెలకు రూ. 153తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందని తెలిపా రు. అయితే ఈ ఫోన్‌ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ, కిరణ్‌లు ఈ ఫోన్ ఫీచర్ల వివరాలను వెల్లడించారు. వాయిస్ కమాండ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని, 22 భాషలు సపోర్ట్ చేస్తుందని వెల్ల డించారు. జియో యాప్స్‌ను కూడా ఇన్‌బిల్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఫోన్‌కు ఆగస్టు 15 నుంచి టెస్టింగ్ ప్రా రంభిస్తారు.. అదే నెలలో 24వ తేదీ నుంచి ప్రి-బుకిం గ్‌ను ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి మొబైళ్లను అందజే స్తారు. ఫోన్‌కు చాలా శక్తివంతమైన స్పీకర్లు, వీటికి ఎలాంటి ఎన్‌హాన్స్‌మెంట్ అవసరం ఉండదని అన్నారు.
దేశంలోనే అతిపెద్ద బోనస్ షేర్
జియో ఫోన్‌తో తీపి కబురు వినిపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ వార్షికోత్సవం సందర్భంగా వాటాదా రులకు బోనస్ షేర్‌ను ప్రకటించింది. 1: 1 నిష్పత్తిలో బోనస్ షేర్లను వాటాదారులకు అందిస్తున్నట్టు శుక్రవా రంనాడు సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపా రు. దీని ప్రకారం ప్రతి షేరుకు అదనంగా ఒక షేర్ బోన స్‌గా లభించనుంది. ఈ ప్రకటనతో మార్కెట్లో రిలయన్స్ షేరు 3.60 శాతం లాభపడి రూ.1,584 వద్ద కొనసా గుతోంది. దేశంలో అతిపెద్ద కంపెనీ ఆర్‌ఐఎల్ 12 ఏళ్ల క్రితం వాటాదారులకు బోనస్ షేర్‌ను ప్రకటించింది.
1,000 పెట్టుబడితో రూ.16.5లక్షలు
1977లో రిలయన్స్ షేర్లలో రూ.1,000 పెట్టుబడికి గాను ఈ రోజు దీని విలువ రూ. 16.5 లక్షలకు చేరుకుం దని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. అంటే ఇన్వెస్టర్ల పెట్టుబడి ప్రతి రెండున్నరేళ్లకు ఓ సారి రెట్టింపు అవుతూ వచ్చింది. అదేసమయంలో కంపెనీ రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దేశంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించిందని అన్నారు. 1977లో రూ.10 కోట్ల మార్కెట్ విలువను కల్గి ఉన్న కంపెనీ ఇప్పుడు రూ.5 లక్షల కోట్లకు చేరిందని, అంటే 50 వేల రెట్లు పెరిగిందని అన్నారు.

ఫీచర్లు ఇలా ఉన్నాయి
Phones ఆల్ఫా న్యూమరిక్ కీబోర్డ్
2.4 ఇంఛ్ క్యూవిజిఎ డిస్‌ప్లే
ఎఫ్‌ఎం రేడియో
టార్చ్ లైట్
హెడ్‌ఫోన్ జాక్
ఎస్‌డి కార్డు స్లాట్
ఫోర్ వే నావిగేషన్ సిస్టమ్
ఫోన్ కాంటాక్ట్
కాల్ హిస్టరీ
జియో యాప్స్

జియో విస్తరణ..
*రూ.5 లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ మార్కెట్ విలువ
*ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఐఎల్‌కు 2,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
*10 నెలల్లో జియో అనేక రికార్డులను బ్రేక్ చేసింది. ప్రతి రోజు ఒక సెకండ్‌కు ఏడుగురు కస్టమర్లు చేరారు.
*జియో ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్.. 125 కోట్ల జిబిని ఇప్పటివరకు వినియోగించారు.
*ప్రి-పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు భారీ స్థాయిలో 100 మిలియన్ల కస్టమర్లు చేరారు.
*99 శాతం మంది భారతీయులకు జియో సేవలను అందించాలనుకుంటోంది.
* కొద్ది 10 వేల కార్యాలయాలు, 10 లక్షల ఔట్‌లెట్లు

ఫోన్ గురించి కొన్ని విషయాలు..
* ఫోన్ కోసం రూ.1500 రిఫండబుల్ డిపాజిట్ చేయాలి. 36 నెలల తర్వాత ఈ డబ్బును పూర్తిగా వాపస్ ఇస్తారు. వాయిస్ కాల్స్ ఎల్లప్పుడూ ఉచితంగా ఉంటాయి.
* నెలకు రూ.153 చెల్లించడం ద్వారా జియో వినియోగదారులు ఉచిత వాయిస్ కాల్స్, డాటా, ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు.
* ఆగస్టు 24 నుంచి ప్రి-బుకింగ్ ప్రారంభిస్తారు. అయితే అదే నెలలో 15 నుంచి టెస్టింగ్ ఉంటుంది. ముందుగా నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యతనిస్తారు. సెప్టెంబర్ 1నుంచి ఈ మొబైళ్ల పంపిణీ ఉంటుంది.
* ఈ దాదాపు 22 దేశీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. పూర్తిగా విఒఎల్‌టిఇ ఆధారితంగా పనిచేస్తుంది.
* మరో ప్లాన్ నెలకు రూ.309తో టివితో ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. అందువల్ల వినియోగదారులు జియో ఫోన్ ద్వారా టివీలపై ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది.
* నెలవారీ ప్లాన్‌లు వద్దనుకునేవారికి ప్రతి రోజు రిచార్జీ రూ.24, వారం రీచార్జి రూ.54 కూడా ఉంది.
* ఎన్‌ఎఫ్‌సి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌కు జియో ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
* ఎస్‌ఒఎస్ బటన్‌ను ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనిలో 5 నంబర్‌ను ఒత్తిపట్టుకకోవడం ద్వారా ఎమర్జెన్సీ కాల్స్‌కు వెళ్తుంది.
* వారానికి 50లక్షల ఫోన్లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
* ఈ ఫోన్‌లో మరో అద్భుతమైన ఫీచర్ వాయిస్ కమాండ్స్ కూడా ఉంటుంది. దీంతో కాల్స్, మెసేజ్‌లు చేసుకోవడంతో పాటు ఇతర జియో యాప్స్‌ను కూడా వాయిస్ కమాండ్స్ ద్వారానే ఉపయోగించొచ్చు. ఇందులో వాట్సాప్ యాప్ లేదు.