Search
Wednesday 21 November 2018
  • :
  • :

సెన్సెక్స్ @ 34,000

sensex

స్టాక్‌మార్కెట్లో మరో కీలక మైలురాయిని చేరిన సూచీలు
మరోవైపు తొలిసారిగా 10,500 మార్క్‌కు ఎగువన నిఫ్టీ

ముంబై: స్టాక్‌మార్కెట్లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరి రికార్డు సృష్టించాయి. చివరి సమయంలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి 34,000 పాయింట్లను దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా మొదటిసారి 10,500 మార్క్‌కు ఎగువన నిలిచింది. లాభాల స్వీకరణ, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి రు. గురువారం డిసెంబర్ సిరీస్ ముగియనుండటంతో రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆఖరికి మా ర్కెట్లు పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 34,010 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 10,531 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ దశలో సూచీ 33890 నుంచి – 34062 పాయింట్ల మ ధ్య.. నిప్టీ సూచీ 10,545 నుంచి -10,478 పాయింట్ల మ ధ్య కదలాడింది. అయితే బ్యాంక్స్ మాత్రమే 0.7 శాతం నష్టపోగా.. మెటల్, రియల్టీ 1.2 శాతం చొప్పున మెరిశాయి. ఇదే బాటలో ఫార్మా, మీడియా, ప్రైవేట్ బ్యాంక్స్ బలపడ్డాయి. బ్లూచిప్స్‌లో భారతీ, అంబుజా, సిప్లా, బాష్, వేదాంతా, ఆర్‌ఐఎల్, సన్ పార్మా, యస్‌బ్యాంక్, గెయిల్, టాటా స్టీల్ లాభాలతో దూసుకెళ్లాయి. మరోవైపు కోల్ ఇండియా, ఎస్‌బిఐ, ఐఒసి, ఎన్‌టిపిసి, హెచ్‌యుఎల్, ఎం అండ్ ఎం, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. గత ఐదు రోజుల్లో అమ్మకానికే ప్రాధాన్యమిస్తూ రూ.3,600 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) గత శుక్రవారం మాత్రం స్వల్పంగా రూ. 108 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే మరోవైపు నగదు విభాగంలో గత ఐదు సెషన్లలో రూ. 3,750 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన దేశీ ఫండ్స్(డిఐఐలు) శుక్రవారం కూడా రూ.371 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
గెయిల్ మరింత గెయిన్
గ్యాస్ పంపిణీ సంస్థ గెయిల్ ఇండియా కొనుగోలుకి ప్ర భుత్వ రంగ దిగ్గజాలు ఐఒసి(ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్), బిపిసిఎల్(భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ఆసక్తి చూపడం గెయిల్ షేరుకు కలిసివచ్చింది. దీం తో ఇన్వెస్టర్ల దృష్టి గెయిల్‌పై పడింది. మార్కెట్లో గెయిల్ తొలుత రూ. 514 వరకూ ఎగసి సరికొత్త గరిష్ఠానికి చేరింది. ఎన్‌ఎస్‌ఇలో గెయిల్ షేరు విలువ 1.45 శాతం పెరిగి రూ. 510.40 వద్ద ముగిసింది. రెండు కంపెనీలు ఆసక్తి చూపుతున్నా.. ఓఎన్‌జిసితో విలీనం కంపెనీకి లాభదాయకంకాగలదని గెయిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

comments