Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సెన్సెక్స్@37,000

bsచరిత్రాత్మక రికార్డులను సాధించిన సెన్సెక్స్, నిఫ్టీ

ముంబై: స్టాక్‌మార్కెట్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. కొద్ది రోజులుగా సూచీలు వేగంగా పరుగులు తీస్తున్నాయి. గురువారం ఎట్టకేలకు సెన్సె క్స్, నిఫ్టీ రెండు సూచీలు చరిత్రాత్మక రికార్డులను సాధించాయి. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 37,000 పాయింట్లను అధిగమించింది. అలాగే నిఫ్టీ 11,186కు చేరింది. దీంతో సూచీలు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. మార్కెట్ ము గిసేసరికి సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 36,985 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 35 పా యింట్లు బలపడి 11,167 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇలో పిఎస్‌యు బ్యాంక్స్ 5.5 శాతం దూసుకెళ్లాయి. ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ 1 శాతం చొ ప్పున లాభపడ్డాయి. అయితే మెటల్, ఐటి 0.8 శా తం డౌన్ అయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎస్‌బిఐ 6.4 శాతం పెరిగింది. ఇక ఐషర్, పవర్‌గ్రిడ్, గ్రా సిమ్, ఐసిఐసిఐ బ్యాంక్, అల్ట్రాటెక్, టెక్ మహీం ద్రా, ఒఎన్‌జిసి, ఎయిర్‌టెల్, లుపిన్ 4- నుంచి 2 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు యస్ బ్యా ంక్, మారుతి 4 శాతం పతనమయ్యా యి. ఐఒసి, హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్, విప్రో, టిసిఎస్, హిందా ల్కో, టైటన్, ఏసియన్ పెయింట్స్ 2- నుంచి 1 శా తం మధ్య బలహీనపడ్డాయి. బిఎస్‌ఇలో 1,354 షేర్లు లాభపడగా, 1,217 నష్టాలతో ముగిశాయి. గత రెండు రోజులుగా విదేశీ ఇన్వెస్ట ర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే బుధవారం ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) నగదు విభాగంలో దాదాపు రూ. 1196 కోట్ల పె ట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక దేశీ ఫండ్స్(డిఐఐలు) స్వల్పంగా రూ. 98 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

13 ఏళ్లలో 7,000 నుంచి 37,000లకు సెన్సెక్స్
గత 13 ఏళ్లలో బ్లూచిప్ కంపెనీలు అంటే అతిపెద్ద సంస్థలు దాదాపు 3400 శాతం వరకు రాబడిని ఇచ్చాయి. ఇదే కాలంలో సెన్సెక్స్ కూడా 30 వేల పాయింట్లు పెరిగి ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 37,000 మార్క్‌ను చేరుకుంది. కార్పోరేట్ ఫలితాలు, డిఐఐ, ఎఫ్‌ఐఐల నుంచి పెట్టుబడులు వెరసి మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరి 23న 36వేల పాయింట్ల మైలురాయిని తొలిసారిగా దాటిన సెన్సెక్స్ 37వేల మైలురాయిని చేరేందుకు సరిగ్గా ఆరునెలలు పట్టింది. సెన్సెక్స్ 37 వేల కీలకస్థాయిని అధిగమించడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంది. అయితే 35వేల పాయింట్లను ఈ ఏడాది జనవరి 18 తొలిసారిగా దాటిన సెన్సెక్స్, ఆ తర్వాతి కీలకస్థాయి 36వేల పాయింట్లను అధిగమించడానికి ఐదురోజులే తీసుకుంది.

Comments

comments