Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

హెచ్చుతగ్గులు.. ఆఖరికి నష్టాలు

Sensex closes 79 points lower, Nifty at 10,585

79 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

న్యూఢిల్లీ : దీపావళి తర్వాత మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. ఆఖరికి స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్లు క్షీణించి 35,158 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 13 పాయింట్లు క్షీణించి 10,585 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఆసియా, యూరోపియన్ మార్కెట్లు బలహీనపడడంతో దేశీ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఎన్‌ఎస్‌ఇలో ఐటి, మెటల్, పిఎస్‌యు బ్యాంక్స్, రియల్టీ రంగాలు బలహీనపడ్డాయి. అయితే ఫార్మా, ఆటో, మీడియా, ప్రైవేట్ బ్యాంక్స్ 1 నుంచి -0.5 శాతం మధ్య బలపడ్డాయి. ప్రధానంగా యస్‌బ్యాంక్, హెచ్‌పిసిఎల్, ఐబి హౌసింగ్, అదానీ పోర్ట్, ఏసియన్ పెయింట్స్, బిపిసిఎల్, హీరో మోటో, సన్ ఫార్మా, మారుతీ, ఐఒసి 5 నుంచి -2 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, గెయిల్, టిసిఎస్, ఆర్‌ఐఎల్, టాటా స్టీల్ నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1340 లాభపడగా, 1197 నష్టాలతో నిలిచాయి. గురువారం మార్కెట్లకు సెలవు, దీపావళి రోజు(బుధవారం) మూరత్ ట్రేడింగ్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.31 కోట్లు మేరకు ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 27 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

Sensex closes 79 points lower, Nifty at 10,585

Telangana Latest News

Comments

comments