Home తాజా వార్తలు మళ్లీ 36,000 దాటిన సెన్సెక్స్

మళ్లీ 36,000 దాటిన సెన్సెక్స్

Domestic stock marketsనష్టాల నుంచి తేరుకుని.. ఆఖరి గంటలో ర్యాలీ

ముంబై: దేశీ స్టాక్‌మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను నమోదు చేశాయి. ఆఖరి సమయంలో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత మళ్లీ వెంటనే పుంజుకున్నాయి. వాణిజ్య వివాద చర్చలను మూడో రోజూ కొనసాగించేందుకు అమెరికా, చైనా ఆసక్తి చూపిన నేపథ్యంలో సానుకూల సంకేతాలు కనిపించాయి. యూరోపియన్ స్టాక్‌మార్కెట్లు కూడా హుషారుగా ప్రారంభంకావడంతో సెంటిమెంటుకు బలపడిందని నిపుణులు పేర్కొన్నారు. సెన్సెక్స్ 36,250- నుంచి 35,863 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 232 పాయింట్లు పెరిగి 36,213 పాయింట్ల వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 10,855 వద్ద స్థిరపడింది.

ఎన్‌ఎస్‌ఇలో ఎఫ్‌ఎంసిజి. ప్రైవేట్ బ్యాంక్స్, రియల్టీ, ఆటో స్వల్పంగా పుంజుకున్నాయి. మెటల్స్ 1.2 శాతం వెనకడుగు వేసింది. ప్రధానంగా యాక్సిస్ బ్యాంక్, ఐటిసి, టాటా మోటార్స్, యుపిఎల్, హెచ్‌డిఎఫ్‌సి, ఐబి హౌసింగ్, ఇండస్‌ఇండ్, ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు 3- నుంచి 1 శాతం మధ్య లాభపడ్డాయి. బిఎస్‌ఇలో ట్రేడైన షేర్లలో 1,155 లాభపడగా, 1,442 షేర్లు నష్టాలతో ముగిశాయి. మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.534 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.698 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.

Sensex Crosses 36,000 Points Again