Home తాజా వార్తలు 37,600 పాయింట్లు దాటిన సెన్సెక్స్

37,600 పాయింట్లు దాటిన సెన్సెక్స్

bsns

వరుసగా ఏడో రోజు మార్కెట్ జోరు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డుల పర్వం కొనసాగిస్తూనే ఉంది. మంగళవారం సూచీలు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. ఐటి, ఫార్మా, ఆటోమొబైల్ రంగ షేర్ల అండతో మార్కెట్ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. ఆర్‌బిఐ సమీక్ష నేపథ్యం లో మదుపర్లు అప్రమత్తతంగా వ్యవహరించారు. అందుకే తొలుత మార్కెట్లు స్తబ్దుగా కనిపించాయి. నష్టాలతోనే సాగినప్పటికీ ఆఖరి సమయంలో ఒక్కసారిగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు అ మాంతం లాభాల వైపు పయనించాయి. తొలుత సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టగా, నిఫ్టీ 11,300 మార్క్‌ను కో ల్పోయింది. మార్కెట్ ముగియడానికి గంట ముం దు ఐటి, ఔషధ, విద్యుత్, ఆటోమొబైల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు వెళ్లువెత్తాయి. దీంతో నష్టాల నుంచి కోలుకున్న సూచీలు మళ్లీ రికార్డుల వెంట పరుగులు తీశాయి. మార్కెట్ ముగిసే సమయాని కి సెన్సెక్స్ 112 పాయింట్లు లాభపడి 37,606 వ ద్ద జీవనకాల గరిష్ఠస్థాయిలో స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 11,356 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది. ప్రధానంగా టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, హిందుస్థాన్ యునిలివర్, అదానీపోర్ట్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఐషర్‌మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి, టాటామోటార్స్ షేర్లు నష్టపోయాయి.
ఇండిగో షేరు భారీగా పతనం
క్యూ1(ఏప్రిల్‌జూన్) ఫలితాల ప్రభావం ఇండిగో షేరుపై కనిపించింది. తొలి త్రైమాసికంలో నికర లాభం 97 శాతం క్షీణించి రూ.27 కోట్లు మాత్ర మే నమోదు చేసింది. ఇదే సమయంలో లాభం రూ.811 కోట్లుగా ఉంది. ప్రతి త్రైమాసికంలోనూ మంచి లాభాలను నమోదు చేస్తున్న సంస్థ ఈసారి చతికిలబడింది. దీంతో మంగళవారం ఇండిగో షేర్లు 11 శాతానికి పైగా నష్టపోయాయి. చమురు ధరల కారణంగా జూన్ త్రైమాసికం ఆదాయం 97శాతం తగ్గిందని ఇండిగో ప్రకటించిన మర్నాడే షేర్ల విలువ భారీగా పడిపోయింది. రూ.950 మధ్యలో మొదలైన్ షేరు ధర ఒక దశలో రూ.890కు చేరింది. ఆఖరికి 7 శాతం నష్టపోయి షేరు విలువ రూ.933కు చేరింది.