Search
Thursday 15 November 2018
  • :
  • :

ముంచిన ‘అవిశ్వాసం’

Stock-Exchange

 లాభాలతో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా డీలా

 147 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 

న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం తీర్మానం తీసుకురావడంతో బుధవారం స్టాక్‌మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశా యి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లో రికార్డు స్థాయిని చేరుకున్న సూచీలు అక్కడి నుంచి అమాంతం పడిపోగా, సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టపోయింది. ఆఖరికి 36,373 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రవేశపెట్టడం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఉదయం మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. బ్యాం కింగ్, ఆటోమొబైల్, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లతో దాదాపు 200 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 36,747 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 70 పాయింట్లకు పైగా లాభపడింది. ఆ వెంటనే లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలతో ఈ జోరు ఎంతో సేపు నిలవలేదు. కేంద్రంపై అవిశ్వాస తీ ర్మానం నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జా రుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 200 పా యింట్ల వరకు నష్టపోయింది. ఆ తర్వాత చాలా సేపు ఊగిసలాడిన సూచీ చివరకు 146 పా యింట్లు కోల్పోయి 36,373 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 11వేల మార్క్‌ను కోల్పోయిం ది. 28 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఒఎన్‌జిసి, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు టాటాస్టీల్, హిందాల్కో, వేదాంతా లిమిటెడ్, యూపీఎల్ లిమిటెడ్, టాటామోటార్స్ షేర్లు నష్టపోయాయి.

Comments

comments