Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఊగిసలాటలో మార్కెట్లు

bsns

 స్వల్పంగా 22 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. ఐటి, ఫార్మా స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 22 పాయింట్ల నష్టంతో 36,351 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 23 పాయింట్లు డౌన్ అయి 10,957 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిశ్రమ ప్ర పంచ సంకేతాలతో ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఫై నాన్స్, ఫార్మా, మెటల్, ఐటి షేర్ల పతనంతో సూచీ లు నష్టాల బాటపట్టాయి. ట్రేడింగ్ ఆద్యంతం లా భనష్టాల మధ్య ఊగిసలాటకు లోనైంది. ఆఖరికి సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఇలోని ప్రభుత్వ రంగ బ్యాంకు, ఎఫ్‌ఎంసిజి సూచీ లు తప్ప మిగతా అన్ని రంగాలకు చెంది సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా ఫార్మా ఇండె క్స్ 1.50శాతం క్షీణించింది. కీలకమైన బ్యాంకు నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 26,790 వద్ద ము గిసింది. ప్రధానంగా భారతీఎయిర్
టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, వేదాంత, యస్ బ్యాం కు, టైటాన్ షేర్లు 1నుంచి 3 శాతం లాభపడ్డాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఎల్ అండ్ టి, కోటక్ బ్యాంక్, హిందాల్కో షేరు 2 నుంచి 6 శాతం మేరకు నష్టపోయాయి.

Comments

comments