Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

నాలుగో రోజూ నష్టాలు

sensex

35 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్

న్యూఢిల్లీ: వరుసగా నాలుగో రోజు స్టాక్‌మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటులో అనిశ్చితి, అమెరికా చైనా వాణిజ్య చర్చలు, క్రూడ్ ఆయిల్ ధరలు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో సెన్సెక్స్ సూచీ కీలక 35 వేల స్థాయిని, నిఫ్టీ- సూచీ 10,600 స్థాయిని కోల్పోయాయి. కర్నాటక కొత్త ముఖ్యమంత్రి యడ్యూరప్పను అసెంబ్లీలో తన బలాన్ని శనివారాని సాయంత్రం కల్లా నిరూపించుకోవల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించడంతో దేశీయ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. వీటితో పాటు వాణిజ్య సుంకాల పెంపు వివాద అంశంపై అమెరికా,- చైనా రెండో దశ చర్చల నిర్వహిస్తున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. ఈ కారణాలతో ఈ వారం ఆఖరు ట్రేడింగ్ రోజైన శుక్రవారం సెన్సెక్స్ 301 పాయింట్ల నష్టంతో 34,848 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 86 పాయింట్లు క్షీణించి 10,596 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 34,821 -నుంచి 35,163 పాయింట్ల మధ్య కదలాడింది. కీలకమైన బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ 198 పాయింట్లు నష్టపోయి 25,875 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఎంసిజి రంగానికి చెందిన సూచీ మినహా మిగతా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఈ వారం మొత్తం మీద స్టాక్ సూచీలు 2 శాతం మేర పతనమయ్యాయి. ఒకేవారంలో ఇంతగా సూచీలు నష్టపోవడం రెండు వారాల తర్వాత ఇదే మొదటిసారి.. ప్రధానంగా విప్రో, సిప్లా, టాటామోటర్స్, సన్‌ఫార్మా, ఇండియాబుల్ హౌస్ ఫైనాన్స్ షేర్లు 3 నుంచి 4శాతం నష్టపోయాయి. మరోవైపు కోటక్, హిందూస్థాన్ యునిలివర్, బజాజ్ ఫైనాన్స్, టెక్‌మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి.
ఎవెన్యూ సూపర్‌మార్ట్ షేరు 6 శాతం డౌన్
ఎవెన్యూ సూపర్‌మార్ట్ షేరు దాదాపు 6 శాతం పతనమైంది. స్టాక్‌మార్కెట్లో ఈ షేరు రూ. 1407 వద్ద ముగిసింది. కంపెనీ ప్రమోటర్ రాధాకృష్ణన్ దమానీ కొంతమేర వాటాను విక్రయించారనే వార్తలు రావడంతో ఎవెన్యూ సూపర్‌మారట్స్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో తొలుత రూ. 1503 వద్ద ఇంట్రాడే గరిష్టాన్నీ, రూ. 1376 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. డిమార్ట్ స్టోర్ల నిర్వహణ సంస్థ ఎవెన్యూ సూపర్‌మారట్స్ ప్రమోటర్ రాధాకృష్ణన్ దమానీ స్టాక్ ఎక్స్ఛేంజీల లిస్టింగ్ నిబంధనల ప్రకారం 62 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు. కంపెనీ ఈక్విటీలో 1 శాతానికి సమానమైన వీటిని మే 21- జూన్ 14 మధ్య విక్రయించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కౌంటర్ అమ్మకాలతో బలహీనపడింది. ప్రస్తుత ధర ప్రకారం దమానీకి రూ. 850 కోట్లు లభించనున్నాయి.

Comments

comments