Home తాజా వార్తలు మళ్లీ ట్రేడ్ వార్ ఆందోళనలు

మళ్లీ ట్రేడ్ వార్ ఆందోళనలు

 74 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Sensexముంబై: అమెరికా  చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం భయాలు మళ్లీ మొదలవడంతో సోమవారం మార్కెట్లు బలహీనపడ్డాయి. సెన్సెక్స్  74 పాయింట్లు నష్టపోయి 35,548 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 17.85 పాయింట్ల పతనంతో 10,799- పాయింట్ల వద్ద ముగిసింది. కీలకమైన నిఫ్టీ బ్యాంక్ 8 పాయింట్లు స్వల్ప నష్టంతో 26,409 వద్ద స్థిరపడింది. చైనా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలను పెంచడం, దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాల్ని పెంచుతున్నట్టు ప్రకటించడంతో ట్రేడ్ వార్ భయాలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం నష్టాల బాట పట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ప్రారంభంలో ముడిచమురు తగ్గుదలతో పెట్రోరంగ కంపెనీ షేర్ల ర్యాలీతో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడి 35722 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 10830 పాయింట్లు వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్ సెషన్ సమయానికి లోహ, ఐటీ రంగాలకు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, సూచీలు డీలాపడ్డాయి. ప్రధానంగా బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, వేదాంత, హిందాలో