Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మార్కెట్ జోరుకు బ్రేక్

Stock-Exchange

ఆర్‌బిఐ వడ్డీరేట్ల పెంపుతో 85 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్

ముంబై: రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపుతో వరు స లాభాలతో దూసుకెళ్తున్న మార్కెట్ జోరుకు బ్రేక్ పడింది. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆర్‌బిఐ సమీక్ష నేపథ్యంలో మెల్లగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ లాభాల వైపు చూడలేదు. దీంతో సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టపోయి 37,522 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 10 పాయింట్ల పతనమై 11,346 వద్ద స్థిరపడింది. మరోవైపు అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ సమీక్ష పట్ల ఇన్వెస్టర్ల అప్రమత్తమవడంతో అమ్మకాలు కనిపించాయిఇ. మిడ్ సెషన్ నుంచి ఇన్వెస్టర్లు రిజర్వ్ బ్యాంకు ద్రవ్యపరపతి సమీక్ష పట్ల అప్రమత్తత వహించడంతో మార్కెట్ ముగింపు వరకు సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోన్నాయి. సెన్సెక్స్ ఇంట్రాడే హై నుంచి లో వరకు 274 పాయింట్ల స్థాయిలో కదలాడింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ కూడా కీలక వడ్డీ రేట్ల ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. దీంతో సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు 167 పాయింట్ల నష్టపోయి 27,597 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి, ఐటి, ఫార్మా లాభాలతో ముగిశాయి. ఫైనాన్షియల్, ఆటో, మెటల్ రంగ సూచీలు నష్టాలతో ముగిశాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో పాటు రూపాయి రీకవరీతో నేడు భారత మార్కెట్ రికార్డు ర్యాలీతోనే ప్రారంభమయ్యింది. రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీ రెట్లు రెపో, రివర్స్ రెపోలను పావుశాతం చొప్పున పెంచడంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా టాటాస్టీల్, వేదాంత, మారుతి, ఐసిఐసిఐ బ్యాంకు, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫ్రాటెల్, ఐఒసి, లుపిన్, కోల్ ఇండియా షేర్లు 2 శాతం నుంచి 3 శాతం మేరకు లాభపడ్డాయి.

Comments

comments