Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Sensex ends at new high of 38,897; Nifty closes at 11,738

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంచి లాభాలతో ముగిశాయి. కొద్ది రోజులుగా రికార్డుల మీద రికార్డులతో స్టాక్ మార్కెట్ల సూచీలు దూసుకెళ్తున్నాయి. కొనుగోళ్ల దన్నుతో సూచీలు పైపైకి ఎగిశాయి. దీంతో మంగళవారం  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 202 పాయింట్లు లాభపడి 38,897 వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 11,738 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లో బుల్ అదరగొట్టింది.

కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ 19.99%, అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ 15.65%, రెడింగ్టన్ ఇండియా 9.83%, ఫైజర్ 9.10%, అదానీ ఎంటర్ ప్రైజెస్ 8.27%,  బిఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్-6.04%, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ -5.85%, గెయిల్ ఇండియా -5.43%, డిబి కార్ప్ -5.40%, పిసి జువెలర్స్ -5.11%,లు  టాప్ లూజర్స్ గా ఉన్నాయి.

Comments

comments