Home తాజా వార్తలు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1000 పాయింట్లు లాస్…

ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1000 పాయింట్లు లాస్…

Sensex falls over 1000 points

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆదిలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లు కోల్పోయింది. అదే విధంగా నిఫ్టీ కూడా 10 వేల 200 పాయింట్ల క‌న్నా త‌క్కువే ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.45గా రికార్డు అయ్యింది. వాల్‌స్ట్రీట్ కుదేలు కావ‌డంతో ఆసియా మార్కెట్లు కూడా బోరుమ‌న్నాయి. దాదాపు 8 నెల‌ల త‌ర్వాత అమెరికా మార్కెట్లు ఖంగుతిన్నాయి. ఆ ప్ర‌భావం  ఇండియన్ స్టాక్ మార్కెట్ల‌పై పడింది. జ‌పాన్‌ నిక్కీ మార్కెట్ 3.2 శాతం ప‌డిపోయింది. మార్చి త‌ర్వాత ట్రేడింగ్‌లో ఇంత దారుణంగా కుదేలు కావ‌డం ఇదే మొద‌టిసారి. ఫెడ‌ర‌ల్ బ్యాంక్ ప‌న్ను రేటు పెంచ‌డం కారణంగానే స్టాక్ మార్కెట్లు ఇలా పడిపోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

Sensex falls over 1000 points