Search
Thursday 15 November 2018
  • :
  • :

నాలుగు వారాల గరిష్ఠానికి సెన్సెక్స్

bs

ఎఫ్‌ఎంసిజి స్టాక్స్‌లో కొనుగోళ్ల జోష్ 

161 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూ డో రోజు లాభాలను నమోదు చేశాయి. సోమవారం అర శాతం మేరకు పుంజుకున్నాయి. 30 షేర్లు బిఎస్‌ఇ సెన్సెక్స్ 161 పాయింట్లు లాభపడి 33,789 పాయింట్లకు పెరగడంతో.. నాలు గు వారాల గరిష్టానికి చేరుకుంది. ఆసియా, యూరప్ మార్కెట్లు పుంజుకోవడంతో దేశీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. గతవారం చైనాఅమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా యుఎస్ మార్కెట్లు భారీగా పతనమవగా.. వీటి ప్రభావం ఉంటుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. అయితే ఇవి దేశీ స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం సూచీలు లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 10,379 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇలో ఎఫ్‌ఎంసిజి, బ్యాంకింగ్ రంగాలు 1 శాతం లాభపడ్డాయి. ఫార్మా, ఐటి 0.5 శాతం పెరిగింది. నిఫ్టీ దిగ్గజాలలో బిపిసిఎల్, యాక్సిస్, హెచ్‌పిసిఎల్, హిందాల్కో, ఐఒసి, టైటన్, ఇండస్‌ఇండ్, ఐటిసి, ఎం అండ్ ఎం, హెచ్‌యుఎల్ లాభపడ్డాయి. జి, లుపిన్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, భారతీ, వేదాంత, ఐబి హౌసింగ్, గెయిల్, టిసిఎస్, అదానీ పోర్ట్ సంస్థలు నష్టపోయాయి. బిఎస్‌ఇలో ట్రేడైన మొత్తం షేర్లలో 1644 లాభపడితే, 1094 షేర్లు నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) శుక్రవారం రూ. 525 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 1305 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి.
25వేల పాయింట్ల పైకి నిఫ్టీ బ్యాంక్
ఎన్‌ఎస్‌ఇలో నిఫ్టీ బ్యాంక్ సూచి సాంకేతికంగా కీలకమైన 25వేల పాయింట్ల మార్కును దాటిం ది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ సూచి 24,848.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1 శాతంపైగా ర్యాలీ, కోట క్ మహీంద్రా బ్యాంక్ జీవితకాల గరిష్టాన్ని న మోదు చేయడం, పిఎన్‌బి బ్యాంక్ నెల గరిష్టాని కి చేరడం, ఐసిఐసిఐ బ్యాంక్ నష్టాల్లో తిరిగి లా భాల్లోకి రావడం వంటి అంశాలు సానుకూలం గా మారాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ 25 వేల మా ర్క్‌ను దాటింది. ఓ దశలో 280 పాయింట్లు లా భపడి 25,152 పాయింట్ల గరిష్టాన్ని తాకింది.

Comments

comments