Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఎంఎస్‌పి ప్రకటనతో జోష్

bsns

 269 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ ఆందోళనలతో తొలుత ఇన్వెస్టర్ల అప్రమత్తంగా ఉండడంతో స్వల్పంగా నష్టాలు కనిపించాయి. అయితే ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)ను ప్రకటించడంతో కొనుగోళ్లు వెల్లువెత్తి.. సూచీలు లాభాల బాటపట్టాయి. మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 269 పాయింట్లు లాభపడి 35,647 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 10,770 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 170 పాయింట్ల లాభంతో 26,426కు చేరింది. ఖరీఫ్ సిజన్‌కి గాను కేంద్రం మద్దతు ధర ప్రకటించడంతో సూచీలు సానుకూలంగా స్పందించాయి. నాణ్యమైన వరికి రూ. 1770, సాధారణ వరికి క్వింటాలుకు రూ. 1750కి మద్దతు ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరికి మద్దతు ధర రూ. 250 మేర పెంచగా, ఇతర ప్రధాన వ్యవసాయ పంటలకు కూడా మద్దతు ధరలను పెంచారు. దీంతో వ్యవసాయ ఆధారిత షేర్లలోను కొనుగోళ్లు భారీగా జరిగాయి. కావేరీ సీడ్, మంగళం సీడ్, ఎల్‌టి ఫుడ్స్, కోహినూర్ ఫుడ్స్, చంబల్ ఫెర్టిలైజర్స్, దీపక్ ఫెర్టిలైజర్స్, ఆర్‌సిఎఫ్ వంటి షేర్లు 1 నుంచి 10 శాతం మేర లాభాలను నమోదు చేశాయి. దేశంలో బాస్మతి పంటకు మద్దతు పలికేలా కేంద్రం నిర్ణయం ఉందంటూ పలు కంపెనీలు వెల్లడించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.71 వద్ద ట్రేడ్ అయింది. ఎస్‌ఎస్‌ఇలో బజాజ్ ఆటో, లుపిన్, మారుతి సుజుకీ, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు లాభపడ్డాయి. మరోవైపు హిందుస్థాన్ పెట్రోలియం, గ్రాసిమ్, సిప్లా, ఎన్‌టిపిసి, వేదాంతా లిమిటెడ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

Comments

comments