Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మార్కెట్లకు జోష్

Sensex

 సెన్సెక్స్ 304 పాయింట్లు, నిఫ్టీ 94 పాయింట్లు పైకి.. 

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లా భాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పెరిగాయి. సెన్సెక్స్ 36,227.79 గరిష్ఠ స్థాయిని, నిఫ్టీ 10,941.05 గరిష్ఠ స్థాయిని తాకాయి. కాగా డే ట్రేడింగ్‌లో నిఫ్టీ కనిష్ఠంగా 10,876.65 పాయింట్లు, సెన్సెక్స్ కనిష్ఠంగా 36,019.63 స్థాయిని తాకింది. గమనించాల్సిన విష యం ఏమిటంటే నిఫ్టీ 11,171.55 పాయింట్లు, సెన్సెక్స్ 36,443.98 పాయింట్ల చారిత్రక స్థాయిని ఇదివరకే చే రుకున్నాయి. మంగళవారం సాయంత్రం సెన్సెక్స్ 304 పాయింట్ల పెరిగి 36,239 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 10,947 వద్ద ముగిశాయి. ట్రేడింగ్‌లో హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ బాగా లాభపడ్డాయి. వీటితోపాటు యెస్ బ్యాంకు, కోల్ ఇండియా, విప్రో, బజాజ్ ఆటో, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, మీడియా షేర్లు తప్పిం చి మిగతా అన్ని షేర్లు పెరిగాయనే చెప్పాలి. నిఫ్టీలో గెయి ల్ 5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. హిందాల్కో 3 శాతం పెరిగాయి.
హిందుస్థాన్ పెట్రోలియం 1.9 శా తం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1.4 శాతం నష్టాన్ని చవిచూశాయి. ఐటి, రియాల్టీ, పెట్టుబడి రంగాల ప్రము ఖ కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. ఈ కారణం గా సెన్సెక్స్ ఆరంభంలోనే 200 పాయింట్లు పెరిగి 36, 000 మార్కును చేరుకుంది. కాగా సోమవారం అం కెల ప్రకారం దేశీయ పెట్టుబడి సంస్థలు(డిఐఐలు) రూ. 74 0.39 కోట్ల షేర్లు కొనగా, విదేశీ పెట్టుబడి సంస్థలు (ఎఫ్‌ఐఐలు)569.91 కోట్ల షేర్లను అమ్మారు. ఆసియా మా ర్కెట్‌లో హాంకాంగ్‌కు చెందిన హెంగ్‌సెంగ్ సూచీ 0.41 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ సూచీ 0.94 శాతం పెరుగగా, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ సూచీ 0.06 శాతం పతనం అయింది. అమెరికాకు చెందిన డో జోన్స్ పారిశ్రామిక సగటు సోమవారం
1.31 శాతం పెరిగింది.

Comments

comments