Home తాజా వార్తలు 11,900 పాయింట్ల పైన నిఫ్టీ

11,900 పాయింట్ల పైన నిఫ్టీ

Sensex

 

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. తొలుత లాభాలతో పైపైకి దూసుకెళ్లిన సూచీలు సాయంత్రానికి కాస్త తగ్గి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 163 పాయింట్లు పెరిగి 39,779 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 11,918 పాయింట్ల వద్ద స్థిరపడింది. హెచ్‌సిఎల్ టెక్, టిసిఎస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు భారీగా లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే ఐటి, ఎఫ్‌ఎంసిజి సూచీలు 1 శాతానికి పైగా పెరిగాయి. మీడియా, పిఎస్‌యు బ్యాంక్‌ల సూచీలు 2 శాతం వరకు నష్టపోయాయి.

జమ్ముకాశ్మీర్ బ్యాంక్ మాజీ సిఎండి అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో ఆ బ్యాంక్ షేర్లు దాదాపు 20 శాతం నష్టపోయాయి. జెట్ ఎయిర్‌వేస్ షేర్లు 8 శాతం విలువ కోల్పోయాయి. వరుసగా ఆరుట్రేడింగ్ సెషన్ల నుంచి ఈ షేరు పతనమవుతోంది. ఆర్‌పవర్ 20 శాతం పతనమై రూ.4.94 స్థాయికి చేరింది. ఈ కంపెనీ మార్చి త్రైమాసికానికి రూ.3,559 కోట్ల నష్టాన్ని ప్రకటించడంతో షేరు భారీగా పతనమైంది.

Sensex jumps 169 pts, Nifty settles above 11,900