Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఎఫ్‌ఎంసిజి జోరుతో లాభాల్లో సెన్సెక్స్

 భారీగా నష్టపోయిన బ్యాంకింగ్

BSEముంబయి: స్టాక్‌మార్కెట్ లాభాల జోరును కొనసాగిస్తోంది. 90 శాతం వరకు వస్తువులకు జిఎస్‌టిలో పన్ను రేట్లను ఖరారు చేయడం.. ఇది ఎఫ్‌ఎంసిజి కంపెనీలకు ఇది సానుకూలంగా ఉండడంతో ఈ షేర్లు లాభాలతో దూసుకెళ్లా యి. దీంతో సెన్సెక్స్ 106 పాయింట్లు లాభపడి 30570.97 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 10.35 పాయింట్ల లాభంతో 9438.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రారంభంలో భారీగా పెరిగిన నిఫ్టీ సూచీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో 9450 స్థాయికి కింద ముగిసింది. 6 శాతానికి పైగా లాభపడిన ఐటిసి వంటి ఎఫ్‌ఎంసిజి స్టాక్స్, ఐటీ, లార్సెన్ అండ్ టర్బోలు రెండో రోజు స్టాక్‌మార్కెట్ ముందుకు సాగేంకు దోహదం చేశాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, లుపిన్ నష్టాలను నమోదు చేశాయి. గత సెషన్‌లో నష్టాల పాలైన మిడ్ క్యాప్స్, సోమ వారం కూడా నష్టాల్లోనే కొనసాగాయి. అటు డాలర్ తో రూపాయి మార కం విలువ 8 పైసలు బలపడి, 64.56 వద్ద ముగిసింది. ఎంసిఎక్స్ మార్కెట్లో బంగా రం ధరలు స్వల్పంగా 26 రూపాయల లాభంలో 28,661 వద్ద నమోదయ్యా యి. త్రైమాసిక ఫలితాల్లో నష్టాలను తగ్గించుకున్నప్పటికీ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 10.96 శాతం నష్టపోయింది. ఎస్‌బిఐ 4.46 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3.13 శాతం, అలహాబాద్ బ్యాంక్ 4.78 శాతం, సిండికేట్ బ్యాంక్ 4.95 శాతం, ఐడిబిఐ బ్యాంక్ 3.99 శాతం నష్టపోయాయి.
తగ్గిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బిఒఐ) సోమవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రక టించిం ది. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగింపునాటి క్యూ4లో బ్యాంక్ నికర నష్టం రూ.1,045.54 కోట్లు నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి నష్టం తగ్గు ముఖం పట్టింది. 2015-16 ఆర్థిక సంవ త్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.3,587.11 కోట్ల నికర నష్టం ఉన్న విషయం తెలిసిందే. మొండి బకాయిల సమస్య పరిష్కారమవుతుండడంతో నికర నష్టం తగ్గుతూ వస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో లాభాలు గడించినందున ఎలాంటి డివిడెండ్ ప్రకటించడం లేదని బ్యాంకు తెలిపింది. బిఒఐ ఆదాయం గతేడాది రూ.11,384.91 కోట్ల నుంచి ఈసారి రూ.12,3 35.71 కోట్లకు పెరి గింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికర నష్టం రూ.6,089.21 కోట్ల నుంచి రూ.1,558.34 కోట్లకు చేరింది. మొత్తం ఆదా యం రూ.45,449.01 కోట్ల నుంచి రూ.46,063.18 కోట్లకు పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌పై బిఒఐ షేరు విలువ భారీగా 10.96 శాతం పడిపోయి రూ.158.75కు చేరింది.

Comments

comments