Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జిఎస్‌టి రేట్ల తగ్గింపు జోష్

bs

222 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం మంచి లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ 11,080 పాయింట్లను అధిగమించి ఆరు నెలల గరిష్టస్థాయి వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు నెలకొన్నప్పటికీ మార్కెట్ లాభాల బాట పట్టింది. అనేక ఉత్పత్తులపై జిఎస్‌టి మండలి ధరలను తగ్గించిన తర్వాత ఎఫ్‌ఎంసిజి, మెటల్, రియాల్టీ, పవర్ స్టాక్స్ ర్యాలీని కొనసాగించాయి. చివరి గంటలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిసింది. మార్కెట్ ముగిసేసరికి బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 222 పాయింట్ల లాభంతో 36,719 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 11,085 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి సుజుకీ, హిందూస్థాన్ యూనిలీవర్ షేర్ల అండతో సూచీలు రికార్డులను నెలకొల్పాయి. నిఫ్టీ ఐటీ తప్ప మిగతా అన్ని సూచీలు లాభాల్లో ముగియగా, ఎఫ్‌ఎంసిజి ఇండెక్స్ అత్యధికంగా 2.50 శాతం లాభపడింది. కీలకమైన నిఫ్టీ బ్యాంకు అరశాతం (135 పాయింట్లు) లాభపడి 27,008 వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ అప్పటి రికార్డు గరిష్టస్థాయి 11,171 పాయింట్ల స్థాయిని అందుకోవాలంటే మరో 86 పాయిం ట్లు పెరగాల్సివుంది.  అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల మధ్య ఉదయం మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 36501 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 11,020 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రధానంగా ఐటిసి, అదానీ పోర్ట్, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, వేదాంత, యుపిఎల్ 4 నుంచి 15 శాతం లాభపడ్డాయి. ఇక గ్రాసిం, హెచ్‌డిఎఫ్‌సి, విప్రో, బజాజ్ అటో, హీరో మోటోకార్ప్ షేర్లు 2 నుంచి 6 శాతం నష్టపోయాయి.

Comments

comments