Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ

     34 వేల పాయింట్లను దాటిన సూచీ         

     మెటల్, ఫార్మా రంగాల్లో భారీ కొనుగోళ్లు

Stock-market

న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తీవ్ర ఒడిదుడుల మధ్య కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు ఎట్టకేలకు భారీగా లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లకు పైగా లాభపడింది.
మెటల్, ఫార్మా, ప్రైవేట్ రంగాల్లో భారీ కొనుగోళ్లు లాభాల ముగింపునకు కారణమయ్యాయి. మొత్తానికి సెన్సెక్స్ 323 పాయింట్లు లాభపడి 34,142 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 108.35 పాయింట్లు లాభపడి 10,491.05 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 33832 నుంచి – 34168 మధ్య శ్రేణిలో కదలాడింది. కీలకమైన బ్యాంక్ నిఫ్టీ 347 పాయింట్లు అంటే 1.39 శాతం లాభపడి 25,302.50 పాయింట్ల వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే అన్ని సెక్టార్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో సెంటిమెంటు బలపడింది. దీంతో దేశీయంగానూ ఎలాంటి ప్రతికూలాంశాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. చివరి అరగంటలో సెన్సెక్స్ సూచి అత్యధికంగా 347 పాయింట్ల లాభపడి 34168 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదు చేసింది. బ్యాంకింగ్, లోహ, లోహ, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన షేర్లు ర్యాలీ బాటపట్టాయి. అయితే మార్కెట్లో ప్రధానంగా మెటల్, ఫార్మా షేర్లు మంచి లాభాలతో దూకుడుగా ఉన్నాయి. మెటల్ సూచి 3.19 శాతం లాభపడి 4,028.80 వద్ద, ఫార్మా సూచి 2.64 శాతం ర్యాలీ 9,095.40 వద్ద ముగిసింది. టాటాస్టీల్ 6 శాతం లాభపడి మెటల్ ఇండెక్స్‌ను, సన్‌ఫార్మా 4శాతం ర్యాలీ చేసి ఫార్మా రంగాన్ని నడిపించాయి. ము ఖ్యంగా వేదాంత, టెక్ మహీంద్రా, యూపిల్, సన్‌ఫార్మా, టాటాస్టీల్ షేర్లు 3 నుంచి 6 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఏసియన్ పెయింట్స్, గెయిల్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్ నష్టపోయాయి.

Comments

comments